అంకుల్ శవాన్ని సమాధిలో నుంచి తవ్విన వ్యక్తి.. కారణం తెలిసి ఫ్యూజులు ఔట్..

వియత్నాం దేశంలో( Vietnam ) ఒక షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది.ఈ దేశంలోని థాన్ హోవా ప్రావిన్స్‌లో( Thanh Hoa Province ) నివసించే 37 ఏళ్ల “లు థాన్ నామ్”( Lu Thanh Nam ) అనే వ్యక్తి తన అంకుల్ సమాధిని తవ్వి అతడి శవాన్ని అక్కడినుంచి వేరే చోటికి తీసుకెళ్లాడు.

 Vietnamese Man Arrested For Digging Up Uncles Grave To Settle Gambling Debts Det-TeluguStop.com

తర్వాత ఎముకలను ఒక మూటగా కట్టి ఆ విషయాన్ని కుటుంబానికి తెలియజేశాడు.అంకుల్ ఎముకలను మళ్లీ ఉన్నచోట ఉంచాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని అతడు బ్లాక్ మెయిల్( Blackmail ) చేయడం ప్రారంభించాడు.

ఇలాంటి నేరానికి అతను పాల్పడతాడని కుటుంబ సభ్యులు కూడా ఊహించలేకపోయారు.

ఇలా ఎందుకు చేశాడంటే అతను కోట్లాది రూపాయల అప్పుల్లో ఉన్నాడు.

అప్పులను తీర్చడానికి తన కుటుంబాన్ని బెదిరించాలని నిర్ణయించుకున్నాడు.అంకుల్ ఎముకలను చూపిస్తూ, ఈ ఎముకలను తిరిగి ఇవ్వాలంటే కోట్లాది రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు.

ఈ ఘటన గురించి తెలిసే చాలామంది షాక్ అవుతున్నారు.ప్రజలు ఈ వ్యక్తి చేసిన పనిని తప్పుబట్టారు.

సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

Telugu Uncles Grave, Debt, Grave Theft, Lu Thanh Nam, Debts, Vietnam, Vietnamese

ఈ వ్యక్తి తన అంకుల్ సమాధిలో( Uncle Grave ) 20 సెంటిమీటర్ల లోతు గొయ్యి తీశాడు.ఆ తర్వాత ఎముకలను దొంగతనం చేసి, వాటిని చెత్త కుప్పలో దాచాడు.తన బంధువు భార్యకు అనామకంగా ఫోన్ చేసి, అంకుల్ ఎముకలను తన దగ్గర ఉంచుకున్నానని, వాటిని తిరిగి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు.

పోలీసులకు చెప్పినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.

Telugu Uncles Grave, Debt, Grave Theft, Lu Thanh Nam, Debts, Vietnam, Vietnamese

ఈ బెదిరింపు ఫోన్ కాల్ తర్వాత బంధువులు వెంటనే సమాధిని పరిశీలించారు.సమాధిపై గుర్తు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు ఈ ఘటనను విచారించి, లు థాన్ నామ్ అనే వ్యక్తే దొంగతనం చేసినట్లు గుర్తించారు.

ఈ వ్యక్తిని అరెస్టు చేశారు.అతని దగ్గర నుండి దొంగతనం చేసిన ఎముకలను స్వాధీనం చేసుకుని, బంధువులకు తిరిగి ఇచ్చారు.

వియత్నాం చట్టాల ప్రకారం, ఈ నేరాలకు 7 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

వియత్నాం సంస్కృతి ప్రకారం, సమాధిని దోచుకోవడం చాలా అశుభం.

దీని వల్ల మరణించిన వారి ఆత్మ శాంతికి భంగం కలుగుతుందని, జీవించి ఉన్నవారి జీవితాలపై ప్రభావం పడుతుందని నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube