నా మాతృభూమి నాకు ముఖ్యమంటూ రూ.కోట్లు వదులుకున్న సుదీప్.. ఏం జరిగిందంటే?

శాండిల్ వుడ్ స్టార్ హీరో సుదీప్( Sudeep ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సుదీప్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.

 Kichcha Sudeep Shocking Decision Details, Kichcha Sudeep, Hero Kichcha Sudeep, P-TeluguStop.com

సుదీప్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.కర్ణాటక రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లను ఫోన్ పే సంస్థ( Phone Pe ) వ్యతిరేకించగా ఆ సంస్థపై బహిష్కరణ ప్రచారం మొదలు కావడం గమనార్హం.

ఫోన్ పే విషయంలో కన్నడిగులు చేస్తున్న పోరాటానికి సుదీప్ మద్దతు తెలిపారు.ఫోన్ పేతో సుదీప్ ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకోగా ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం( Karnataka Government ) రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ సంస్థల నియామకాలలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Telugu Kichcha Sudeep, Karnataka, Kichchasudeep, Phone Pe, Phonepe, Private Job-

ఐటీ రంగం విషయంలో పాపులర్ అయిన బెంగళూరు నగరం( Bengaluru ) ఉన్న రాష్ట్రంలో ఈ తరహా నిర్ణయం తీసుకుంటే కంపెనీలు ఇతర రాష్ట్రాలకు మూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కామెంట్లు వినిపించాయి.ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్( Sameer Nigam ) ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.కర్ణాటక రాష్ట్రంలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాల ఉద్యోగులు ఈ నిర్ణయం విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Telugu Kichcha Sudeep, Karnataka, Kichchasudeep, Phone Pe, Phonepe, Private Job-

కర్ణాటకలో సుదీప్ ఫోన్ పేకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా ఆయన ఫోన్ పేతో అగ్రిమెంట్ క్యాన్సిల్ దిశగా అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఫోన్ పే సంస్థ కన్నడిగులకు క్షమాపణ చెబితే ఈ వివాదం పరిష్కారం అయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.నా మాతృభూమి నాకు ముఖ్యమంటూ సుదీప్ కోట్ల రూపాయలు వదులుకోవడానికి సిద్ధమయ్యారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం కొసమెరుపు.సుదీప్ నిర్ణయంకు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube