ధనవంతులు పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటారు.ఈ సమయంలో వాళ్లు ఇచ్చే బహుమతులు( Gifts ) చాలా ఖరీదు చేస్తుంటాయి.
ఇటీవల ఓ దుబాయ్ మిలియనీర్( Dubai Millionaire ) తన భార్యకు ఏకంగా 60 లక్షల రూపాయల విలువైన బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.అతడి భార్యకు 26 ఏళ్లు సుస్సెక్స్కు ఈ భార్య పేరు సౌదీ అల్ నదాక్.
( Saudi Al Nadak ) భర్తకు 32 ఏళ్లు.అతని పేరు జమాల్ అల్ నదాక్.
( Jamal Al Nadak ) ఈ సంపన్న దంపతులు దుబాయ్‌లోని ఒక యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు.ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు.
మూడేళ్లుగా భార్యాభర్తలు గా మెలుగుతున్నారు.సౌదీ ఇప్పుడు గృహిణి.జమాల్ దుబాయ్‌లో ధనవంతుడిగా మారాడు.ఈ హస్బెండ్ తన భార్యకు ప్రత్యేకమైన, గుర్తుంచుకోదగిన క్షణాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.ఆమెను సంతోషపెట్టడానికి బహుమతులు కొంటుంటాడు.ఇక పుట్టినరోజు నాడు( Birthday ) తన సతీమణికి రూ.60 లక్షల విలువైన బహుమతులు అందించి ఘనంగా బర్త్ డే పార్టీ జరిపాడు.ప్రతి సంవత్సరం ఆమె జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటాడు.
సౌదీ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.ఆ వీడియోలో భర్త తన పుట్టినరోజున ఎంత డబ్బు ఖర్చు చేశాడో చెప్పింది.15,000 డాలర్ల విలువైన “మియు మియు” బ్రాండ్( Miu Miu Brand ) నుంచి షాపింగ్ చేశామని, లక్ష రూపాయల విలువైన డిన్నర్ ఆస్వాదించామని, “హెర్మెస్” ( Hermes Brand ) బ్రాండ్ షోరూంలో 29 లక్షల రూపాయల విలువైన బహుమతులు కొన్నామని ఆమె చెప్పింది.ఇంతే కాకుండా స్పాలు, ఫేషియల్ ట్రీట్మెంట్లు వంటి బ్యూటీ కేర్ ట్రీట్మెంట్స్పై భారీగా డబ్బు ఖర్చు చేసినట్లు తెలిపింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.34 లక్షలకు పైగా వ్యూస్, 51,000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి.కామెంట్ల సెక్షన్లో చాలా మంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు.కొంతమంది దీన్ని డబ్బు వృథా అని, ఇవన్నీ డబ్బున్న వారి ఆడంబరాలే అని అభిప్రాయపడ్డారు.