పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు,08 మంది అరెస్ట్.

నగదు 19,000/- రూపాయలు, ఒక ద్విచక్ర వాహనం,07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం.సిరిసిల్ల టౌన్ ఇంచార్జ్ సి.

 Sudden Attacks On Poker Bases, 08 People Arrested , Ci Sadan Kumar , Sudden Atta-TeluguStop.com

ఐ సదన్ కుమార్.రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ నగర్ లోని సిరిగిరి చిన్న నర్సయ్య అనే వ్యక్తి ఇంట్లో డబ్బులు పందెం పెట్టుకుని రహస్యంగా పేకాట ఆడుతున్నారు అనే పక్కా సమాచారం మేరకు శుక్రవారం రాత్రి సమయంలో పేకాట స్థావరం పై దాడి చేసి పేకాట ఆడుతున్న 08 మంది వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 19,000/-రూపాయల నగదు,07 మొబైల్ ఫోన్స్, ఒక ద్విచక్ర వాహనం, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేయడం జరిగిందని సి.ఐ సదన్ కుమార్ తెలిపారు.పేకాట ఆడుతున్న సిరిగిరి చిన్న నర్సయ్య, అంబేద్కర్ నగర్ , సిరిసిల్ల, తుమ్మ రాజు ,బి వై నగర్ , సిరిసిల్ల,గుండ సతీష్ , వెంకంపేట , సిరిసిల్ల,వంగ వెంకటేశం, రగుడు ,సిరిసిల్ల బూర్ల అమర్నాథ్,శ్రీనగర్ కాలనీ సిరిసిల్ల,బొగ్గుల రాజేందర్, రగుడు ,సిరిసిల్ల,బిజ్జిగా పరశురాములు ,అంబేద్కర్ నగర్ , సిరిసిల్ల,పెరుమాండ్ల ప్రవీణ్ , సంజీవనగర్ సిరిసిల్ల లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ….సులభ సంపాదనకు అలవాటుపడి కొంతమంది ఈ విధంగా చెడు వ్యసనాలకు అలవాటు పడి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతు ఆభరణాలు, వాహనాలను తాకట్టు పెడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నా,వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిత్యం పోలీస్ ల ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిరహిస్తామని ఎవరైన, గ్యాంబ్లింగ్, బెట్టింగులకు కానీ, పేకాట వంటి జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటమని హెచ్చరించారు.మీ ప్రాంతంలో ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నవి తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్100 కి సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube