నకిలీ గల్ఫ్ ఏజెంట్లు తీరు మార్చుకోకపోతే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు.

ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారిని మోసం చేసే ఏజెంట్ల పై జిల్లా పోలీస్ ప్రత్యేక నజర్.ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు.

 If The Fake Gulf Agents Do Not Change Their Ways, There Is No Way To Ignore Them-TeluguStop.com

ఈ సంవత్సరం జిల్లాలో నకిలి గల్ఫ్ ఏజంట్ల పై 34 కేసులలో 58 మందిపై కేసులు నమోదు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిలాల్లో నకిలి గల్ఫ్ ఏజెంట్ల మోసలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో గతంలో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగిందని,నకిలీ గల్ఫ్ ఏజెంట్లు తీరు మార్చుకోకపోతూ ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని,గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం అని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా నుంచి ఉపాది నిమిత్తం గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలన్నారు.

ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారు తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు చేపడతాం అని , జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితుల ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఉపాధి కోసం వెళ్ళే వారి వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని, నకిలీ వీసాలు ఇచ్చి ,పాస్ పోర్ట్ లు దగ్గర ఉంచుకొని ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఏజెంట్ల పై జిలాల్లో గత సంవత్సరం 34 కేసులలో 38 మందిని అరెస్ట్ చేసి 09 మందిని జైలుకి తరలించడం జరిగిందని, ఈ సంవత్సరం 34 కేసులలో 58 మందిని అరెస్ట్ చేసి ఇద్దరిని జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు.

ఉపాధి కోసం గల్ఫ్ వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని, గల్ఫ్ దేశాలకు వెళ్ళు వారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించి, వారి ద్వారానే వీసాలు పొందవలసిందిగా సూచించారు.గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకొనుటకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ 8712656411 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించవచ్చని సూచించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube