టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో దర్శకుడు సుకుమార్ ( Sukumar )ఒకరు.పుష్ప(Pushpa ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారినటువంటి ఈయన ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే ఇక ఈ సినిమాలో కేశవ పాత్ర కూడా చాలా హైలెట్ గా నిలిచింది.అల్లు అర్జున్ తర్వాత కేశవ పాత్ర( Kesava Role ) కి అదే స్థాయిలో ఆదరణ లభించింది అని చెప్పాలి.
ఇకపోతే తాజాగా సుకుమార్ కేశవ పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.యంగ్ హీరో సుహాస్( Suhas ) ప్రధాన పాత్రలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించిన ప్రసన్న వదనం( Prasanna Vadanam ) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఈ సినిమాకు సుకుమార్ శిష్యులు డైరెక్టర్ కావడం విశేషం.ఇక ఈ సినిమా వేడుకకు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ పుష్ప సినిమాలోని కేశవ పాత్ర గురించి పలు విషయాలు వెల్లడించారు.
పుష్ప సినిమాలో కేశవ పాత్రలో ముందుగా హీరో సుహాస్ ను తీసుకోవాలని భావించాము.సుహాస్.నువ్వంటే నాకు, అల్లు అర్జున్‌కు చాలా ఇష్టం.నీ ఎదుగుదల చూస్తున్నాం.కానీ అప్పటికే హీరోగా చేస్తున్న నిన్ను ఆ పాత్రకు ఎంపిక చేయడం బాగోదనిపించింది.ఇక హీరో నాని నటన కూడా నాకు చాలా ఇష్టం సుహాస్ నాకు ఫ్యూచర్ నాని ఇలా కనిపిస్తున్నాడు అంటూ ఈ సందర్భంగా సుహాస్ గురించి సుకుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక పుష్ప సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
.