తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో( CM Revanth Reddy ) సీపీఎం నేతల భేటీ ముగిసింది.ఈ మేరకు సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో తమ్మినేని, జూలకంటి, చెరుపల్లి కీలక సమావేశం అయ్యారన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి సీపీఎం( CPM ) తప్పుకుందని తెలుస్తోంది.భువనగిరి ఎంపీ( Bhuvanagiri Parliament ) బరిలో సీపీఎం తమ అభ్యర్థిని బరిలో నిలిపింది.
అయితే సీపీఎం అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని అధికార కాంగ్రెస్ రిక్వెస్ట్ చేసిందని తెలుస్తోంది.
దీంతో తమ అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఎం తెలిపింది.
కాగా కాంగ్రెస్( Congress ) రిక్వెస్ట్ ను సీపీఎం దాదాపు ఓకే చేసిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సాయంత్రం తమ నిర్ణయాన్ని సీపీఎం ప్రకటించనుందని సమాచారం.
అదేవిధంగా 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామన్న సీపీఎం… బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ తో కలిసి నడుస్తామని తెలిపింది.
.