నా స్ట్రెచ్ మార్క్స్ చూపించమని ఆ డైరెక్టర్ అడిగారు : ఆమని

ఆమని.( Aamani ) ఆంధ్రప్రదేశ్ లోని పెద్దాపురంలో జన్మించి తమిళ సినిమా ఇండస్ట్రీలో మొదటగా అడుగు పెట్టింది.1991 నుంచి 94 వరకు తమిళ సినిమాల్లో నటించిన ఆమని మొట్టమొదటిసారి జంబ లకడి పంబ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇవివి సత్యనారాయణ.అలా తెలుగులో అడుగుపెట్టిన ఆమని ఎన్నో ఏళ్ల పాటు హీరోయిన్ గా నటించారు.

 Actress Aamani About Industry Details, Aamani, Actress Aamani, Aamani Casting Co-TeluguStop.com

తెలుగుతో పాటు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో ఆమె బిజీ ఆర్టిస్ట్ గా ఉండేవారు.అయితే చాలామంది హీరోయిన్స్ లాగా తనకు కాస్టింగ్ కౌచ్( Casting Couch ) ఇబ్బందులు ఎదురయ్యాయని, చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ మాటలతో ఇబ్బంది పెట్టేవారని ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఆమని.

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్న ఆమని తన కెరీర్ తొలినాళ్లలోనీ చెడు అనుభవాలను పంచుకున్నారు.

Telugu Aamani, Aamanibitter, Actress Aamani, Directors, Tamil, Tollywood-Movie

పెద్ద సినిమా ప్రొడక్షన్ హౌసెస్ ఎప్పుడు నటీనటులతో చాలా బాగా ఉంటారని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కేవలం సినిమాకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగేవారని, తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చాలా వింత ఎక్స్పీరియన్సులు ఉన్నాయంటూ చెబుతున్నారు ఆమని.తమిళ సినిమా ఇండస్ట్రీలో( Tamil Cinema Industry ) తొలినాల్లలో తనను ఏకంగా స్ట్రెచ్ మార్క్స్( Stretch Marks ) మీకు ఉన్నాయా, ఉంటే చూపించండి అంటూ బహిరంగంగా అడిగారని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయానని ఆమని చెప్పారు.అంతేకాదు తన తల్లి లేకుండా ఎప్పుడు ఏ షూటింగ్ కి వెళ్లిన అలవాటు లేదని, ఇంట్లో నుంచి కాలు బయట పెడితే తనతో పాటు తన బ్రదర్ లేదా అమ్మ వెంటే ఉండేవారని చెప్పుకొచ్చారు.

Telugu Aamani, Aamanibitter, Actress Aamani, Directors, Tamil, Tollywood-Movie

అయితే ఒకటి రెండు సార్లు కొంతమంది దర్శకులు మీరు ఒక్కరే వస్తే సరిపోతుందని, కారు పంపిస్తున్నామని మీ అమ్మని తోడుగా తీసుకురావద్దు అంటూ చెప్పేవారట.దాంతో అలాంటి సమయంలో అప్పటికే తీసుకున్న అడ్వాన్సులు సైతం వెనక్కి పంపిన రోజులు ఉన్నాయంటూ చెప్పారు.బాడీలో ఎవరికి చెప్పుకోలేని చోట్లు కూడా వారికి చూపించాలంటూ ఇబ్బంది పెట్టిన దర్శకులు కూడా ఉన్నారని చెప్పారు.సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మనకు కావలసింది నటించడం మాత్రమే అని దాని కోసం పక్కదొవ తొక్క కూడదు అని తన తల్లి ఎప్పుడు చెప్పవారని తెలిపారు.

బెంగళూరులో మంచి ఇల్లు ఉంది, మనకు సరిపడా ఆస్తి ఉంది కావాలంటే ఉద్యోగం చేసుకుందాం కానీ ఎవరికీ తల వంచద్దు అంటూ కూడా ఆమె ఎన్నో సార్లు చెప్పారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube