2024 ఏపీ ఎన్నికలకు( AP 2024 Elections ) మరో నెలన్నర సమయం మాత్రమే ఉంది.ఏప్రిల్ నాలుగో వారంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ అయితే ఉంది.
టీడీపీ జనసేన బీజేపీ కూటమి( TDP BJP Janasena Alliance ), వైసీపీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీల వల్ల సులువుగా గెలవడం సాధ్యమని చంద్రబాబు భావిస్తుండగా ఐదేళ్లలో ఇచ్చిన మెజారిటీ హామీలను అమలు చేశామని తమ పార్టీకే ఓట్లు పడతాయని వైసీపీ భావిస్తోంది.
వాస్తవ పరిస్థితులను గమనిస్తే పేద, మధ్యతరగతి ప్రజలు జగన్ పాలన కావాలని కోరుకుంటుండగా ఎగువ మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు మాత్రం చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం వైసీపీకి అనుకూలంగా ఉండగా మిగతా జిల్లాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి.అయితే మూడు హామీల దిశగా అడుగులు వేస్తే మాత్రం జగన్( YS Jagan ) విజయాన్ని ఎవరూ ఆపలేరని విశ్లేషకులు భావిస్తున్నారు.ఏపీలో 60 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ రైతుల కోసం కొన్ని పథకాలు అమలు చేస్తున్నా అంతకు మించి రైతులకు ప్రయోజనం చేకూరేలా వైసీపీ( YCP ) అడుగులు వేయాల్సి ఉంది.రైతుల మద్దతును పూర్తిస్థాయిలో పొందితే వైసీపీకి తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహిళల్లో మెజారిటీ మహిళలు( Majority Women ) వైసీపీ పాలన పట్ల పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు.అయితే రోడ్లు, మౌలిక వసతుల సదుపాయాల హామీల దిశగా జగన్ అడుగులు వేయాల్సి ఉంది.మళ్లీ అధికారంలోకి వస్తే ఏయే రూట్లలో రోడ్లను పూర్తి చేస్తారో చెబుతూ హామీ ఇస్తే వైసీపీకి కచ్చితంగా బెనిఫిట్ కలుగుతుంది.అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా 1,26,000 ఉద్యోగాల భర్తీ చేసిన జగన్ ఏపీకి భారీ సంఖ్యలో సాఫ్ట్ వేర్, ప్రైవేట్ కంపెనీలు( Software Companies ) వచ్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
నిరుద్యోగులు సొంతంగా ప్రభుత్వ సాయంతో వ్యాపారాలు చేసేలా జగన్ సర్కార్ హామీలు ఇవ్వాల్సి ఉంది.ఈ మూడు పనులు చేస్తే మాత్రం ఈ ఎన్నికల్లో జగన్ పార్టీకి తిరుగుండదని ఆ పార్టీ శ్రేయోభిలాషులు, విశ్లేషకులు భావిస్తున్నారు.