Canal : పంటలను సంరక్షించే సరికొత్త పరికరం ఈ కెనాల్.. ఇది ఎలా పని చేస్తుందంటే..?

రైతులు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటను పక్షుల నుంచి, వివిధ రకాల జంతువుల బెడద నుంచి సంరక్షించుకోవడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలను ఎదుర్కొంటున్నారు.పంట చేతికి వచ్చే సమయంలో పక్షులు లేదంటే జంతువులు పంటలను ఆశిస్తే ఇక తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.

 This Canal Is A New Crop Protection Device How Does It Work-TeluguStop.com

అయితే ఈ సమస్యకు ప్రొఫెసర్ జయశంకర్( Professor Jayashankar ) తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఓ సరికొత్త పరికరం రూపొందించింది.

అద్భుత టెక్నాలజీతో పని చేసే ఈ పరికరం పేరు “ఈ కెనాల్”( E Canal ).ఈ పరికరం సోలార్ సిస్టం ద్వారా పనిచేస్తుంది.పంట పొలంలో ఓ చిన్న చెట్టుకొమ్మ చాటున ఈ పరికరాన్ని వేలాడదీయవచ్చు.

ఈ పరికరం నుంచి రకరకాల శబ్దాలు వచ్చే విధంగా దీనిని రూపొందించారు.పులులు, సింహాలు, తుపాకులు, మనుషులు, పక్షులు ఇలా చాలా రకాల జంతువుల అరుపులతో పాటు 20 రకాల శబ్దాలతో కూడిన ఓ చిప్ ను ఈ పరికరంలో అమర్చారు.

ఉదయం, సాయంత్రం పక్షులు పొలంలోకి రాకుండా చూడడంతో పాటు, రాత్రి సమయాల్లో అడవి పందులు దాడి చేయకుండా వాటిని బెదరగొట్టి పరిగెత్తేలా చేస్తుంది ఈ సరికొత్త పరికరం ఈ కెనాల్.ఈ పరికరం నుంచి 110 డెసిబుల్స్ శబ్దం ఎబౌట్ వినిపిస్తుంది.సోలార్ సిస్టం ద్వారా పనిచేసే ఈ పరికరం ఎండలో సుమారుగా రెండు లేదా మూడు గంటలు ఉంటే చాలు ఆటోమేటిక్ గా ఫుల్ ఛార్జ్ అవుతుంది.ఒకసారి ఫుల్ చార్జ్ అయితే నిరంతరం 12 గంటల పాటు వివిధ రకాల శబ్దాలు చేస్తూనే ఉంటుంది.

అన్ని వ్యవసాయ విద్యాలయాల్లో ఈ పరికరం రైతులకు అందుబాటులో ఉంటుంది.ఈ పరికరం ధర రూ.18000 మాత్రమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube