అపర కుబేరుడు ముకేష్ అంబానీ ( Mukesh Ambani ) కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.కొద్దిసేపటి కిందట జామ్ నగర్( Jam Nagar ) లో కాక్ టైల్ పార్టీతో అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్( Pre-wedding celebration ) మొదలైంది.
తారల తళుకులతో పాటు, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులతో అంతా సందడిగా మారింది.అంగరంగ వైభవం ఉన్న ఈ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.
పెళ్లి ఏర్పాట్లు చేయడానికి రెండు కళ్ళు కూడా చాలడం లేదు.కాగా అనంత్ అంబానీ, రాధిక( Ananth Ambani, Radhika ) మర్చంట్ పెళ్లికి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు.చెప్పుకుంటే చాలానే ఉన్నాయి.
కేవలం ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసమే 2500 రకాల వంటకాలతో మెనూ సిద్ధం చేశారు.ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు పాప్ గాయని రిహన్నా అంగీకరించింది.దీని కోసం ఆమెకు ఏకంగా 50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారట.ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు అయిన షారుఖ్ , సల్మాన్, రజనీకాంత్, దీపిక, రణ్వీర్, అలియా, రణబీర్, అక్షయ్ కుమార్, సైఫ్, కియరా ఇలా చెప్పుకుంటూపోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే అని చెప్పాలి.
బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బిల్ గేట్స్, జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు.అరబ్ దేశాలకు చెందిన కొంతమంది రాజులతో పాటు, భూటాన్ రాజ దంపతులు సైతం ఈ వేడుకలకు వచ్చారు.
దాదాపు 2000 మంది అతిథులు ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు హాజరవుతున్నారు.
చాలామంది ఈ రోజు వచ్చారు.మిగతావాళ్లు రేపు, ఎల్లుండి రానున్నారు.జామ్ నగర్ లో తగినన్ని స్టార్ హోటల్స్ లేవు.
అందుకే వీళ్లందరి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ముకేష్ అంబానీ.ప్రతి కుటుంబానికి లగ్జరీ టెంట్ హౌజ్ లు ఏర్పాటు చేశారు.
సెవెన్-స్టార్ హోటల్ సౌకర్యాలతో తాత్కాలికంగా వీటిని ఏర్పాటు చేశారు.పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి బంగారం, డైమాండ్స్ తో తయారుచేసిన ప్రత్యేకమైన బహుమతిని అందించబోతున్నారు.
కొడుకు పెళ్లి కోసం ముకేష్ అంబానీ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.