నంద్యాల జిల్లా శ్రీశైలం( Srisailam ) మల్లన్న దర్శనానికి నడకదారి వెంబటి వెళ్లే భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న వ్యవహారం వివాదాస్పదంగా మారింది.కాలినడకన వెళ్లే భక్తుల( Devotees ) నుంచి అటవీ శాఖ అధికారులు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.అలాగే వాహనాల ద్వారా వచ్చే భక్తుల నుంచి రూ.300 వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.ఎన్నడూ లేని విధంగా పర్యావరణ నిర్వహణ ఖర్చుల పేరుతో అటవీ శాఖ అధికారులు వసూళ్లకు పాల్పడటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారుల తీరుపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.