మహిళా ప్రీమియర్ లీగ్ 2024( WPL 2024 ) సీజన్ తొలి మ్యాచ్ కు క్రికెట్ లవర్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆఖరి బంతికి సజీవన్ సజన( Sajeevan Sajana ) సిక్స్ కొట్టడంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించారు.ముంబై ఇండియన్స్( Mumbai Indians ) లక్ష్యం 172 పరుగులు కాగా 19 ఓవర్స్ ముగిసే సమయానికి ముంబై 160 పరుగులు చేసింది.
చివరి ఓవర్ లో 12 పరుగులు అవసరం కాగా ఆఖరి బంతికి సిక్స్ కొట్టి సజీవన్ సజన లక్ష్యాన్ని సాధించారు.సజీవన్ సజన తండ్రి రిక్షావాలా( Rickshawala ) కాగా సోషల్ మీడియా వేదికగా ఆమె పేరు మారుమ్రోగుతోంది.
కేరళ( Kerala ) వాయనాడ్ లోని మనంతవాడి అనే కుగ్రామంలో ఆమె జన్మించారు.కురిచియా అనే గిరిజన తెగకు చెందిన సజనకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉండేది.
సజన దేశీవాళీ క్రికెట్ లో భారత్ తరపున కేరళ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.సౌత్ జోన్ ఇండియా ఏ జట్ల తరపున కూడా ఆమె ఆడారు.డబ్ల్యూపీఎల్ 2024 రూపంలో ఆమెను లక్ వరించింది.15 లక్షల రూపాయల వరకు సజనను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.కురిచియా తెగ నుంచి డబ్ల్యూపీఎల్ లో భాగమైన రెండో క్రికెటర్ గా ఆమె నిలిచింది.
సజన సక్సెస్ స్టోరీ( Sajana Success Story ) నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఎన్నో కష్టాలను అధిగమించి ఆమె ఈ స్థాయికి చేరారని తెలుస్తోంది.సజన కష్టానికి తగిన గుర్తింపు దక్కాలని రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
సజన తన టాలెంట్ తో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.ఈ తరం అమ్మాయిలకు సజన సజీవన్ సక్సెస్ స్టోరీ స్పూర్తి నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.