రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం వెంకటాపురం గ్రామం లో ఉపాధి హామీ పథకం( employment guarantee scheme ) క్రింద మంజూరైన 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులను ఎల్లారెడ్డిపేట ఎంపీ పి పిల్లి రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు, సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కెకె మహేందర్ రెడ్డి ( KK Mahender Reddy )లు కలిసి శనివారం ప్రారంభించారు.ఈ రోడ్డు పనులను మైసమ్మ గుడి నుంచి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చక్రధర్ రెడ్డి, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతూరి భూపాల్ రెడ్డి, కొండాపూర్ శ్రీనివాస్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, బండారి బాల్ రెడ్డి, దేవేందర్ యాదవ్, మల్లారెడ్డి, దేవయ్య, బాలయ్య , తదితరులు పాల్గొన్నారు.