బీహార్ రాష్ట్రం( Bihar )లో ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం నితీశ్ కుమార్( Nitish Kumar ) సర్కార్ బలపరీక్షలో నెగ్గింది.ఈ మేరకు అసెంబ్లీలో జరిగిన విశ్వాస తీర్మానంలో నితీశ్ కుమార్ ప్రభుత్వం విజయం సాధించింది.
ప్రభుత్వానికి మద్ధతుగా 129 మంది సభ్యులు ఓటేశారు.
ఓటింగ్ సందర్భంగా సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.కాగా బీజేపీ( BJP )తో కలిసి ఏర్పాటు చేసిన కొత్త సర్కార్ పై విశ్వాసం కోరుతూ సీఎం నితీశ్ కుమార్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.