భారతదేశంలో తక్కువ చార్జీలతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే రైలు ఎక్కాల్సిందే.భారతదేశంలో రైల్వేలు( Indian Railways ) అత్యంత చౌకైన ప్రయాణ సాధనంగా ఉన్నాయి.
అయితే కొంతమంది రైల్వే ప్రయాణికులు ప్రయాణ సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు ఫిర్యాదు చేయడం కాస్త ఇబ్బందికరంగా మారింది.రైల్వేలలో ప్రయాణించే చాలా మందికి ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఒక టోల్ ఫ్రీ నెంబర్( Toll Free Number ) ఉందని తెలియదు.
రైల్వేలో ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికులతో ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు.రైల్వే ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ఇంటిగ్రేటెడ్ రైల్ మదద్ హెల్ప్ లైన్ నెంబర్ 139 ను ప్రారంభించింది.

గతంలో రైల్వే ప్రయాణికులు ఫిర్యాదు నమోదు చేసేందుకు హెల్ప్ లైన్ నెంబర్ 182 ను 2021 ఏప్రిల్ ఒకటవ తేదీ నిలిపివేశారు.దీనిని టోల్ ఫ్రీ నెంబర్ 139 లో విలీనం చేశారు.ఈ 139 టోల్ ఫ్రీ నెంబర్ 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.రైల్వే ప్రయాణికులు( Railway Passengers ) స్టార్ బటన్ ను నొక్కడం ద్వారా నేరుగా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయవచ్చు.139 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.టోల్ ఫ్రీ నెంబర్ 139 కి కాల్ చేశాక.
భద్రతా మరియు వైద్య సహాయం కోసమైతే 1 నొక్కాలి.అది కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ కు వెంటనే కనెక్ట్ అవుతుంది.

విచారణ కోసం అయితే 2 నొక్కాలి.సాధారణ ఫిర్యాదుల కోసం 4 నొక్కాలి.విజిలెన్స్ సంబంధిత ఫిర్యాదుల కోసం 5 నొక్కాలి.పార్సిల్ మరియు వస్తువులకు సంబంధించిన ప్రశ్నల కోసం అయితే 6 నొక్కాలి.IRCTC నడిచే రైళ్ల ప్రశ్నల కోసం 7 నొక్కాలి.ఇక రైల్వే ప్రయాణికులు తాము ఫిర్యాదు చేసిన ఫిర్యాదుల స్థితి తెలుసుకోవాలంటే 9 నొక్కాలి.
ఒకవేళ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడాలి అనుకుంటే స్టార్ బటన్ నొక్కాలి.సబ్ మెనులో PNR స్థితి, రైలు రాక/ బయలుదేరిన సమాచారం, వసతి, చార్జీల విచారణ, భోజనం బుకింగ్, వీల్ చైర్ బుకింగ్, టికెట్ బుకింగ్, సిస్టం టికెట్ రద్దు లాంటివి పొందవచ్చు.