Sameer Kamath : అదే యూనివర్సిటీ, అదే విషాదం.. అమెరికాలో మరో భారత సంతతి విద్యార్ధి మృతి

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్ధుల మరణాలు ఆగడం లేదు.ఇప్పటికే నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా.

 23 Year Old Indian Origin Student Found Dead In Us Park Fifth Incident This Yea-TeluguStop.com

తాజాగా మరో భారత సంతతి విద్యార్ధి మృతి చెందాడు.అది కూడా ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలోనే( Purdue University ) కావడం గమనార్హం.

గడిచిన కొద్ది నెలల్లో ఈ విశ్వవిద్యాలయంలో ఓ భారతీయ విద్యార్ధి ప్రాణాలు కోల్పోవడం ఇది మూడోసారి.వివరాల్లోకి వెళితే.

పర్డ్యూలో పీహెచ్‌డీ చదువుతున్న సమీర్ కామత్( Sameer Kamath ) అనే విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మరణించాడు.సోమవారం సాయంత్రం స్థానిక నేచర్ రిజర్వ్ వద్ద సమీర్ శవమై కనిపించాడు.

అమెరికన్ సిటిజన్‌షిప్ వున్న సమీర్‌.గతేడాది ఆగస్టులో మాస్టర్స్ పూర్తి చేసి.

పీహెచ్‌డీలో చేరాడు.అయితే ఆయన మరణానికి స్పష్టమైన కారణాలు ఏంటనేది తెలియరాలేదు.

పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాతే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

Telugu Indian Origin, Neil Acharya, Purdue, Sameer Kamath, Park-Telugu Top Posts

కాగా.అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన నలుగురు భారతీయ విద్యార్ధులు రోజుల వ్యవధిలో హత్యకు గురికావడం అగ్రరాజ్యంలోనూ, మనదేశంలోనూ కలకలం రేపింది.ఈ పరిణామాలు భారత్‌లో వున్న విద్యార్ధుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.

విదేశాలకు పిల్లల్ని పంపాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్ధితి నెలకొంది.అన్నింటికి మించి ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.

రెండేళ్ల వ్యవధిలో ఈ వర్సిటీలో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధుల మరణాలు షాకిచ్చాయి.ఇటీవల నీల్ ఆచార్య ( Neil Acharya )మృతి క్యాంపస్‌లో విద్యార్ధుల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

Telugu Indian Origin, Neil Acharya, Purdue, Sameer Kamath, Park-Telugu Top Posts

గత నెలలో అదృశ్యమైన నీల్ ఆచార్య అనే విద్యార్ధి పర్డ్యూ క్యాంపస్‌లోనే శవమై కనిపించాడు.జనవరి 29న నిర్వహించిన శవపరీక్షలో అతని శరీరంపై గాయానికి సంబంధించి సంకేతాలు లేవని తేలిందని కరోనర్ క్యారీ క్యాస్టెలో తెలిపారు.ఆచార్య మరణానికి స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు లోతుగా విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనకు రెండేళ్ల ముందు ఇదే పర్డ్యూ యూనివర్సిటీలో చదువుకుంటున్న భారత సంతతికి చెందిన వరుణ్ మనీష్ ఛేడా( Varun Manish Cheda ) (20)ను తోటి రూమ్ మేట్, 22 ఏళ్ల కొరియన్ విద్యార్ధి జిమ్మీ షా దారుణంగా హత్య చేశాడు.

ఈ రెండు మరణాల తర్వాత పర్డ్యూ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్ధులు క్యాంపస్‌లో తమ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ మరణాలు భారతీయ విద్యార్ధుల్లో అవిశ్వాసం, ఆందోళనను నింపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube