వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ( YCP Minister Chelluboina Venugopala Krishna ) కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) పార్టీ పెట్టి తన వల్ల కాదని మూసేశారని అన్నారు.అన్నయ్య పార్టీ మూసేస్తే 2012 లో మళ్లీ తమ్ముడు వచ్చాడని విమర్శించారు.2014 లో ఓటమిని ఒప్పుకుని పోటీ నుంచి పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తప్పుకున్నారని ఎద్దేవా చేశారు.మళ్లీ ఇప్పుడు పొత్తులతో వస్తున్నారని విమర్శలు చేశారు.కానీ 2014 లో జగన్ ఓడిపోయినా నిలబడ్డారని మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.ఈ తరహాలోనే వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కలిసొచ్చినా వైసీపీ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు