Geetha Madhuri: ఉదకశాంతి పూజ చేసిన గీతామాధురి… ఈ పూజ ఫలితం ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి గీతామాధురి( Geetha Madhuri ) నటుడు నందుని( Nandu ) ప్రేమించి పెద్దల సమక్షంలో 2014వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇలా ఈ జంట ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

 Geetha Madhuri Perform Udaka Shanthi Pooja Photos Goes Viral-TeluguStop.com

ఇకపోతే గీత మాధురి రెండోసారి తల్లి కాబోతున్న విషయం మనకు తెలిసింది ఈమె తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇదివరకే వెల్లడించారు.ఇక గీత మాధురి ఈ నెలలోనే డెలివరీ కానుందని డెలివరీ డేట్ కూడా ఫిబ్రవరిలోనే ఇచ్చారని తెలిపారు.

Telugu Baby Shower, Geetha Madhuri, Geethamadhuri, Nandu, Udaka Shanthi-Movie

ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా గీతామాధురి సీమంతపు వేడుకలు( Baby Shower ) జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఈ సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా సీమంతపు వేడుకల అనంతరం గీతామాధురి తన భర్తతో కలిసి ఉదకశాంతి( Udaka Shanthi ) పూజ చేశారు.ఈ పూజకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఉదకశాంతి పూజ అంటే ఏంటి గర్భిణీగా ఉన్నటువంటి గీత మాధురి ఈ పూజ చేయడానికి కారణం ఏంటి అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Telugu Baby Shower, Geetha Madhuri, Geethamadhuri, Nandu, Udaka Shanthi-Movie

ఉదకశాంతి పూజ అనేది వేదమంత్రాలతో ఆచరించే ఒక ప్రక్రియ.ఈ పూజలు మంత్రజలంతో చేస్తారు.కాబట్టి దీనిని ఉదకశాంతి పూజ అని పిలుస్తారు.గృహ సంబంధించిన దోషాలు తొలగిపోవడానికి మంత్రంతో నీటిని పవిత్రం చేసే ఆ ఇంటిని ఇల్లు మొత్తం చల్లటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి దోషాలు మొత్తం తొలగిపోతాయి.

దోషాలు తొలగిపోవడం కోసం మాత్రమే కాకుండా ఆయుష్షు ఐశ్వర్యం ఆరోగ్యం కోరుకునే వారు కూడా ఇలాంటి ఉదకశాంతి పూజ చేస్తూ ఉంటారు.ప్రస్తుతం గీత మాధురి చేసినటువంటి ఈ పూజకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube