తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సోహెల్( Syed Sohel ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బస్ హౌస్ కి వెళ్లక ముందు వరకు కూడా సోహెల్ ఎవరు అన్నది చాలా మందికి తెలియదు.
కానీ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు సోహెల్.కథ వేరు ఉంటది అనే డైలాగుతో బాగా ఫేమస్ అయ్యాడు.
ఇక అందరూ అనుకున్న విధంగానే బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా నిలిచి అందరి చేత శభాష్ అనిపించుకోవడంతో పాటు హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత వరుసగా వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు సోహెల్.
ఇప్పుడు సరికొత్తగా హీరో అవతారం ఎత్తాడు సోహెల్.ఇంతకుముందే మిస్టర్ ప్రెగ్నెంట్( Mr Pregnant ) అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.తాజాగా సోహెల్ హీరోగా నటించిన నిర్మాతగా వ్యవహరించిన సినిమా బూట్ కట్ బాలరాజు( Bootcut Balaraju ).తాజాగా ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.ఫిబ్రవరి మొదటివారంలో హెవీ కాంపిటీషన్ మధ్యన సోహెల్ తన సినిమాని విడుదల చేసాడు.
నిన్న శుక్రవారం దాదాపుగా ఆరేడు సినిమాలు విడుదల అయ్యాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ధీర, హ్యాపీ ఎండింగ్, గేమ్ ఆన్, కిస్మత్ సినిమాల మధ్యలో సోహెల్ బూట్ కట్ బాలరాజు విడుదలైంది.
అయితే ఈ చిత్రం విడుదలైన థియేటర్స్ లో ప్రేక్షకులు కనిపించకపోవడంతో నటుడు సోహెల్ ఫ్రస్టేట్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వదిలిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తనని బిగ్ బాస్ లో తెగ ఎంకరేజ్ చేసారు.సోహెల్, సోహెల్ అని అరిచారు.కానీ ఇప్పుడు నా సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఎందుకు రావడం లేదు, అందరిలా ముద్దు పెట్టిన సీన్స్, లవ్ స్టోరీస్ తీస్తేనే చూస్తారా.
ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా సినిమా చేస్తే చూడరా.ప్రమోషన్స్ అంటారా.నేను నా తాహతుకు తగట్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాను.అదొక్కటే చేయగలిగాను, ప్రతిసారి ఫ్రెండ్స్ తోనే కాదు, అమ్మ నాన్నలతో, నాన్నమ్మలతో సినిమాలు చూడండి, కంటెంట్ ఉన్న సినిమాలు ఆదరిస్తారు, నా సినిమా చూడడానికి బాగానే ఉంది కదా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
మరో కమెడియన్ ముక్కు అవినాష్( Mukku Avinash ) సోహెల్ ని ఓదారుస్తూ ఈ వీకెండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూస్తారు నువ్వు ఫీలవ్వకు అంటూ ఓదార్చాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.