హెయిర్ ఫాల్( Hairfall ). దాదాపు ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య ఉంటుంది.
అయితే కొందరిలో తక్కువగా ఉంటే.కొందరిలో మాత్రం జుట్టు రాలడం అనేది చాలా అధికంగా ఉంటుంది.
అలాగే చుండ్రు సమస్యతో కూడా ఎంతో మంది బాధపడుతుంటారు.ఈ రెండిటికీ చెక్ పెట్టే మిరాకిల్ రెమెడీ ఒకటి ఉంది.
ఈ రెమెడీని వారానికి ఒక్కసారి ప్రయత్నించినా చాలు జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు పరార్ అవుతాయి.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక ఉల్లిపాయ( Onion )ను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు నాలుగు రెబ్బలు కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( Coconut Oil ) మరియు సరిపడా ఉల్లిపాయ కరివేపాకు జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.
కుదుళ్లు దృఢంగా మారతాయి.దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది.
అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే రెండు మూడు వాషుల్లోనే మొత్తం తొలగిపోతుంది.
స్కాల్ప్ హెల్తీ గా( Healthy Scalp ) మారుతుంది.కాబట్టి జుట్టు రాలడం, చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తప్పక ఈ రెమెడీని ట్రై చేయండి.