హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) సీరియస్ అయ్యారు.ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను గవర్నర్ కోరారు.
గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఓట్లను అడగాలని తమిళిసై తెలిపారు.అంతేకానీ బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించి ఓట్లు అడగడం సరికాదని పేర్కొన్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections ) తనను గెలిపించకపోతే కుటుంబంతో కలిసి బలవన్మరణానికి పాల్పడతానని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారం చివరి దశలో కౌశిక్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
కాగా ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి( Kaushik Reddy ) విజయం సాధించారు.ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై తీవ్రంగా మండిపడ్డారు.