హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ సీరియస్..!!
TeluguStop.com
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) సీరియస్ అయ్యారు.
ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను గవర్నర్ కోరారు.
"""/" /
గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఓట్లను అడగాలని తమిళిసై తెలిపారు.
అంతేకానీ బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించి ఓట్లు అడగడం సరికాదని పేర్కొన్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) తనను గెలిపించకపోతే కుటుంబంతో కలిసి బలవన్మరణానికి పాల్పడతానని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల ప్రచారం చివరి దశలో కౌశిక్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.కాగా ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి( Kaushik Reddy ) విజయం సాధించారు.
ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై తీవ్రంగా మండిపడ్డారు.
గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)