టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) భార్య నమ్రత ఇటీవల పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే నమ్రత పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు విదేశాలలో ఉండడంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక మహేష్ బాబుతో పాటు తన కుమార్తె సితార గౌతం కూడా నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.తాజాగా నమ్రత( Namrata ) తన 52వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
తన బంధువులు సన్నిహితుల సమక్షంలో ఈ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారని తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ పుట్టినరోజు వేడుకలకు( Namratha Shirodkar Birthday ) పలువురు సెలబ్రిటీల భార్యలు కూడా హాజరై సందడి చేశారని తెలుస్తుంది.నమ్రత పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సతీమణి స్నేహ రెడ్డి పాల్గొన్నారు.
స్నేహ రెడ్డి ( Allu Sneha Reddy )తో పాటు డైరెక్టర్ సుకుమార్ వైఫ్ తబిత కూడా పాల్గొని సందడి చేశారు.ఇక నారా లోకేష్ భార్య బ్రాహ్మిని( Nara Brahmani ) కూడా ఈ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని సందడి చేశారు.పుట్టినరోజు సందర్భంగా సన్నిహితులకు నమ్రత గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
ఈ వేడుకలలో ఈ బ్లాక్ కలర్ డ్రెస్సులో చాలా అందంగా ఉన్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక నమ్రత ఈ పుట్టినరోజు వేడుకలకు మహేష్ బాబు దూరంగా ఉన్నారు.ఈయన రాజమౌళి సినిమా పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.