నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది - ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వస్త్ర పరిశ్రమలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడాన్ని తప్పు పట్టిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, 2004 సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పే విధంగా చేసి వస్త్ర పరిశ్రమలు అభివృద్ధిపరిచింది కాంగ్రెస్ పార్టీ.తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యంతో అనేక మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నేత కార్మికుల ఆత్మహత్యలను గుర్తించి సిరిసిల్లకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ అందించారు.

 Congress Govt Will Support Weavers Mla Adi Srinivas, Congress Govt , Weavers, Ml-TeluguStop.com

ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కు 1,50,000 ఎక్స్ గ్రేషియా,50 సంవత్సరాలకే నేతన్నకు పెన్షన్, 50% పవర్ సబ్సిడి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, సిరిసిల్లకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ద్వారా మహిళా గ్రూపులకు 5 లక్షల వడ్డీ లేని రుణాలు, రాజీవ్ విద్యా మిషన్ (ఆర్ వి ఎం) ద్వారా వస్త్రాన్ని తయారుచేసే ఆర్డర్ ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇచ్చిందని, తెలంగాణలోనే మొట్టమొదటి టెక్స్టైల్ పార్కును తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మరో నాలుగు మాసాల్లో పదవి కోల్పోతున్న ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా వస్త్ర పరిశ్రమకు సహకారం చెయ్యలేదు.

దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా బండి సంజయ్ లేఖ ఉందని, సిరిసిల్ల నేతన్నల కోసం 13 వేల అంత్యోదయ కార్డులను అందజేయడమే కాకుండా రాజీవ్ విద్యా మిషన్ ద్వారా పాలిస్టర్ పరిశ్రమ ఏర్పాటు కృషి చేసాం, గత ప్రభుత్వం చెల్లించని బిల్లులను కూడా చెల్లించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే బిజెపి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు, 20 వేల మంది కార్మికులు ఉన్న ఈ ప్రాంతం నుండి వినోద్ కుమార్, బండి సంజయ్ కలిసి కాకతీయ టెక్స్టైల్ను వరంగల్ కు తరలించినది మీరు కాదా జీఎస్టీ పేరుతో నేతన్నులపై భారము మోపుతుంది మీ ప్రభుత్వం కాదా,

జిఎస్టీ ఎత్తివేయాలని తాము నిరసనలు చేసి మేము అండగా నిలిచామని ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ ఎందుకు జీఎస్టీని తొలగించేందుకు నిబద్ధతతో లేడు? 45 రోజులు కూడా గడవని ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదని, మీకు చాతనైతే వస్త్ర పరిశ్రమ మీద ఉన్న జీఎస్టీని వెంటనే తొలగించండి నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది రేవంత్ రెడ్డి పాదయాత్రలోనే నేతనులతో మాట్లాడారని,కార్మికుడే ఓనర్ అయ్యే పథకాన్ని తీసుకువస్తాం గత ప్రభుత్వంలో

కొంత మందికి మాత్రమే లబ్ది జరిగిందని మా దృష్టిలో ఉంది,దీనిపై కూడా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలో ఉంది, ఎంపీగా మీ బాధ్యతగా మెగా టెక్స్టైల్ క్లస్టర్ను సిరిసిల్లకు తీసుకొస్తే దానికి కావలసిన మిగతావన్నీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకునేలా మేము చూసుకుంటాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు చిలుక రమేష్, కనికరపు రాకేష్, వస్తాది కృష్ణ గౌడ్, పులి రాంబాబు, వంగల శ్రీనువాస్, ముంజ ఉమేందర్, ముప్పిడి శ్రీధర్, చిలివేరి శ్రీనివాస్ గౌడ్, ఎర్ర శ్రావణ్, రెగ్జిన్ శ్రీనివాస్, జమున, సాయి తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube