ఈ కుక్క ఓల్డెస్ట్ డాగ్ కాదా.. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌..

జంతువులకు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్( Guinness World Records ) అవార్డులను ప్రధానం చేస్తాయన్న సంగతి తెలిసిందే.అలాంటి రికార్డ్స్‌లో బాబీ( Bobi ) అనే పోర్చుగల్‌కు చెందిన కుక్క చేరింది.

 Guinness World Records Launches Full Investigation On Oldest Dog Bobi Age Claims-TeluguStop.com

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టీమ్‌ 2023, ఫిబ్రవరి 1న ప్రపంచంలోనే ఎక్కువకాలం జీవించిన అతిపెద్ద కుక్కగా( Longest Living Dog ) బాబీని గుర్తిస్తూ సర్టిఫికేట్ ఇచ్చింది.అప్పటికి దాని వయసు 30 ఏళ్ల 266 రోజులు.

బాబీ రాఫెయిరో డో అలెంటెజో( Rafeiro do Alentejo ) అనే జాతికి చెందినది.ఈ కుక్కలు సాధారణంగా 12-14 ఏళ్ల వరకు జీవిస్తాయి.కానీ బాబీ ఎక్కువ కాలం జీవించింది.ప్రపంచంలోనే అతి పెద్ద కుక్కగా పేరు తెచ్చుకుంది.

బాబీ 30 ఏళ్లు బతకడం గురించి తెలుసుకొని చాలా మంది ఆశ్చర్యపోయారు.బాబీ గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన కొంతకాలానికే చనిపోయింది.

అది 2023, అక్టోబర్‌లో కన్నుమూసిందని డాక్టర్ కరెన్ బెకర్ అనే వెట్ ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.బాబీ ఎంతో మంది హృదయాలను హత్తుకున్న అద్భుతమైన కుక్క అని ఆమె అన్నారు.

Telugu Bobi, Bobi Dog Age, Bobis, Guinness, Longest Dog, Oldest Dog Bobi, Oldest

బాబీ నిజంగానే అత్యంత ఎక్కువ వయసు ఉన్న కుక్క అని కొంతమంది నమ్మలేదు.వేర్వేరు చిత్రాలలో అతని పాదాలు భిన్నంగా కనిపించడం వారు గమనించారు.అతని వయస్సు గురించి ఎవరో అబద్ధం చెబుతున్నారని ఆరోపణలు చేశారు.కొంతమంది నిపుణులు కూడా బాబీ రికార్డును అనుమానించారు.వారిలో డానీ ఛాంబర్స్ ఒకరు.అతను రాయల్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సర్జన్స్‌లో పనిచేశాడు.అతను ది గార్డియన్‌తో మాట్లాడుతూ “నా వెటర్నరీ సహోద్యోగులలో ఒక్కరు కూడా బాబీకి నిజానికి 31 ఏళ్లు అని ఉంటాయని నమ్మలేదు.” అని అన్నారు.

Telugu Bobi, Bobi Dog Age, Bobis, Guinness, Longest Dog, Oldest Dog Bobi, Oldest

ఈ సందేహాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వద్దకు చేరాయి.బాబీ రికార్డును( Bobi Guinness Record ) మళ్లీ తనిఖీ చేయాలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్ణయించింది.ఆధారాలను పరిశీలించి మరిన్ని అభిప్రాయాలను కోరారు.బాబీ రికార్డు నిజమో కాదో తెలుసుకోవాలన్నారు.వారు సమీక్షను పూర్తి చేసే వరకు ఓల్డెస్ట్ డాగ్ టైటిల్స్ కోసం కొత్త దరఖాస్తులను తీసుకోవడం కూడా ఆపివేసారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా బాబీ రికార్డును మార్చలేదు.

తమ పరిశీలన పూర్తయ్యే వరకు వేచి చూస్తామని చెప్పారు. బాబీ రికార్డు రద్దు చేయబడిందని చెప్పే ఎలాంటి నివేదికలను తాము ధృవీకరించబోమని కూడా వారు క్లారిటీ ఇచ్చారు.

బాబీకి ముందు, అత్యంత పురాతనమైన కుక్క బ్లూయ్. ఇది ఆస్ట్రేలియాకి చెందినది ఈ కుక్క 29 సంవత్సరాల వయస్సులో 1939లో మరణించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube