భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England ) మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది.ఈ సిరీస్ లో భాగంగా జరిగే తొలి రెండు మ్యాచ్ల కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ( BCCI Selection Committee ) ప్రకటించింది.
ఈ భారత జట్టులో కొత్త ఆటగాళ్లకి అవకాశం వస్తే.సీనియర్ ఆటగాళ్ళకి మళ్లీ నిరాశే మిగిలింది.
ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్లకు గాయం కారణంగా మహమ్మద్ షమీ( Mohammed Shami ) దూరంగా ఉండనున్నాడు.మహమ్మద్ షమ్మీతోపాటు ఇషాన్ కిషన్ కు( Ishan Kishan ) కూడా జట్టులో చోటు దక్కలేదు.
ఇటీవలే ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా తో టెస్టు సిరీస్ కు ఎంపికవ్వడం, టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్ కు తిరిగి రావడం జరిగిన విషయం తెలిసిందే.
మహమ్మద్ షమీ స్థానంలో అవేష్ ఖాన్ కు( Avesh Khan ) భారత జట్టులో చోటు దక్కింది.ఇషాన్ కిషన్ స్థానంలో వికెట్ కీపర్ గా ధృవ్ జురెల్ కు( Dhruv Jurel ) అవకాశం లభించింది.ఇతనితోపాటు కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ కూడా టెస్ట్ సిరీస్ ఆడే జట్టుకు ఎంపికయ్యారు.
సీనియర్ ఆటగాళ్లయిన అజింక్య రహానే, పుజారాలకు టెస్ట్ సిరీస్ ఆడే భారత జట్టులో చోటు లభించలేదు.
ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్ట్ మ్యాచులు ఆడే భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆవేశ్ ఖాన్.