టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు.అలా గోల్డెన్ లెగ్ ఇమేజ్ ను కలిగి ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఒకరు కాగా సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమాలో నటిస్తున్నారు.
ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం కంటే మంచి పాత్రలు చేయడానికి మృణాల్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలంటే గ్లామర్ మెయింటెయిన్ చేయాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.న్యాచురల్ బ్యూటీ టిప్స్( Natural Beauty Tips ) ను నేను కూడా ఫాలో అవుతానని ముఖానికి పసుపు రాసుకుంటానని, తాజా పండ్లతో ఫేస్ ప్యాక్ చేసుకుంటానని మృణాల్ చెప్పుకొచ్చారు.బియ్యం కడిగిన నీళ్లను ముఖంపై స్ప్రే చేసుకుంటానని ఇది ఒక కొరియన్ చిట్కా( Mrunal Korean Tip ) అని మృణాల్ ఠాకూర్ కామెంట్లు చేశారు.
2023 సంవత్సరంలో కేన్స్ లో సందడి చేయడంతో నా కల తీరిందని ఆమె చెప్పుకొచ్చారు.టీవీ నటులకు సినిమాలలో ఆఫర్లు రావడం సులువు కాదని అయితే ప్రతిభకు అదృష్టం కలిసొస్తే మాత్రం ఎక్కడైనా రాణించవచ్చని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు.
ఎన్ని సమస్యలు ఎదురైనా జీవితాన్ని సంతోషంగా గడపాలనే ఫిలాసఫిని ఫాలో కావడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని ఆమె పేర్కొన్నారు.

ప్రేక్షకులకు నా పేరు గుర్తు లేకపోయినా నేను చేసిన పాత్రలు వాళ్ల మదిలో మెదిలితే చాలని మృణాల్ అన్నారు.రోజూ పనికి వెళ్లాలని నేను ఇష్టపడే పనిని చేయాలని భావిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.లుక్స్ కు, ఈవెంట్స్ కు అనుగుణంగా కొత్తకొత్త ట్రెండ్స్ ట్రై చేస్తానని మృణాల్ ఠాకూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మృణాల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.