ఇదేందయ్యా ఇది...వోడ్కాతో ఆలూ పరాఠా...వీడియో వైరల్..

కొత్త సంవత్సరం ప్రారంభమైంది, కానీ కొన్ని విషయాలు మారలేదు.వాటిలో విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లను( Food Combinations ) తయారు చేయడం ఒకటి.

 Woman Makes Vodka Aloo Paratha Viral Video ,vodka Aloo Paratha,viral Video ,soci-TeluguStop.com

ఈ ఇంటర్నెట్ ట్రెండ్ వల్ల ఇప్పటికే ఎన్నో విచిత్ర వంటకాలు వెలుగులోకి వచ్చాయి.వాటిలో కొన్ని ఆకట్టుకుంటే మరికొన్ని అసహ్యాన్ని కలిగించాయి.

ఈ ఏడాదిలోనూ ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ తాజాగా వోడ్కా ఆలూ పరాఠా( Vodka Aloo Paratha ) హాట్ టాపిక్ గా మారింది.అయితే తాము ఇష్టంగా తినే ఆలూ పరాఠాని వోడ్కాతో తయారు చేయడం ఏంటని చాలా మంది తిట్టిపోస్తున్నారు.

వోడ్కా కలిపితే పరాఠా టేస్ట్ ఎంత దారుణంగా మారుతుందో ఊహించడానికే కష్టంగా ఉందని మరికొందరు పేర్కొంటున్నారు.వోడ్కా ఆలూ పరాఠాను @roopfitnessfoodiee అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తయారు చేసింది.

ఆమె ఈ వింత వంట తయారు చేసి తింటున్న వీడియోను పోస్ట్ చేసింది.వీడియోలో, ఆమె రెసిపీ ప్రతి దశలో నీరు, నూనెకు బదులుగా వోడ్కాని ఎలా వాడుతుందో మనం చూడవచ్చు.ఆమె పిండిని మెత్తగా చేయడానికి, మసాలా బంగాళాదుంపను( Masala Aloo ) స్టఫ్ గా వాడింది.తడి చేయడానికి, పాన్ మీద పరాఠాను వేయించడానికి వోడ్కాను ఉపయోగింది.

ఫలితంగా ఆల్కహాల్‌తో ముంచిన ఫ్లాట్‌బ్రెడ్, బలమైన వోడ్కా రుచి వచ్చింది.ఆ తర్వాత ఆమె పరాఠాను కొద్దిగా తిని దాని టేస్ట్ ఎలా ఉందో వివరించింది.

ఆమె మాట్లాడుతూ ఆ పరాఠా స్పైసీగా, హాట్ గా ఉందని, తల తిరుగుతుందని చెప్పింది.అదే సమయంలో ఆహారం, పానీయాలు రెండింటినీ ఆస్వాదించడానికి ఇది మంచి మార్గం అని కూడా ఆమె పేర్కొంది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో వైరల్‌గా మారింది, 27 లక్షణకు పైగా వ్యూస్ పొందింది.అయితే ఆమె చేసిన ఈ ఫుడ్ ఎక్స్‌పరిమెంట్ నెటిజన్లను పెద్దగా ఆకట్టుకోలేదు.ఆమె ఒక మంచి వంటకాన్ని నాశనం చేసి, మంచి డ్రింక్‌ను వేస్ట్ చేసిన తీరు చూసి వారు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube