టోల్ ఛార్జీలు ఆదా కావాలంటే.. గూగుల్ మ్యాప్స్ తో ఇలా చేసేయండి..!

ప్రపంచవ్యాప్తంగా చాలామంది గూగుల్ మ్యాప్స్( Google Maps ) వాడుతున్నారు.గూగుల్ ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్లను అందిస్తోంది.

 How To Avoid Tolls On Google Maps And Save Money Details, Avoid Tolls ,google M-TeluguStop.com

గూగుల్ మ్యాప్స్ అందించే స్పెసిఫికేషన్లతో రోడ్డు టిప్ ను ప్లాన్ చేసుకుంటే.టోల్ చార్జీలు( Toll Charges ) ఆదా చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా గూగుల్ మ్యాప్స్ లో స్టార్టింగ్ పాయింట్, డెస్టినేషన్ ప్లేస్ ఎంటర్ చేయాలి.ఆ తర్వాత స్క్రీన్ పై భాగంలో కుడివైపు కార్నర్ లో కనిపించే త్రీ డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.

ఐఫోన్లలో ఈ త్రీ డాట్స్ ఐకాన్ హారిజంటల్ గా.ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే త్రీ డాట్స్ ఐకాన్ వెర్టికల్ గా ఉంటుంది.

ఇక త్రీ డాట్స్ మెనూ పై కనిపించే ఆప్షన్స్ అనే ఫీచర్ పై ట్యాప్ చేయాలి.అప్పుడు అక్కడ అవాయిడ్ మోటర్ వేస్ లేదా అవాయిడ్ టోల్స్( Avoid Tolls ) అనే ఆప్షన్ కనిపిస్తుంది.

ఆ ఆప్షన్ టోగుల్ ఆన్ చేయాలి.ఇక గూగుల్ మ్యాప్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి డెస్టినేషన్ ప్లేస్ వరకు మార్గాన్ని చూపుతుంది.

ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవాలి అనుకునే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

టూర్ల కోసం దూరప్రాంతాలకు వెళ్లేవారు టోల్ చార్జీలను ఆదా చేసుకోవడం కోసం ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.దారి పొడవునా ఉండే దృశ్యాలు, లోకల్ కల్చర్స్ ఈ మ్యాప్ ద్వారా చూడవచ్చు.హైవేలపై( Highways ) రద్దీ ఎక్కువగా ఉంటే నాయిసీ హైవేల నుండి కాకుండా ఇతర మార్గాలలో కూడా వెళ్ళవచ్చు.

అయితే టోల్స్ లేదా హైవేలను స్కిప్ చేయడం వల్ల ప్రయాణ సమయం పెరుగుతుంది.కాబట్టి ఈ ఫీచర్ అవసరాలకు షెడ్యూల్ కు సరిపోతుందో లేదో నిర్ణయించుకోవాలి.ఈ ఫీచర్ ఉపయోగిస్తే కలిగే లాభనష్టాలను ముందుగానే అంచనా వేసి ఆ తర్వాత ఉపయోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube