లావణ్య కెరీర్ కు ఇబ్బందులు.. మెగా హీరోల సినిమాలే కారణమా.?

లావణ్య త్రిపాఠి.అందం, అభినయంతో తెలుగు జనాలకు తక్కువ కాలంలోనే దగ్గరయిన ముద్దుగుమ్మ.

 Lavanya Tripati Career Problems Due To Mega Family, Lavanya Tripati, Mega Family-TeluguStop.com

భలే భలే మగాడివోయ్‌ అంటూ యువకుల చూపును తన వైపు తిప్పుకున్న అమ్మడు.టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

మంచి నటనతో అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంది.తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు.

నాని హీరోగా చేసిన భలే భలే మగాడివోయ్ తన కెరీర్ ను పూర్తిగా మార్చి వేసింది.అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తర్వాత మూడేండ్లకు ఈ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది.

మనం, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది లావణ్య.

ఆ తర్వాత అల్లు శిరీష్ తో కలిసి శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా చేసింది.ఈ సినిమా కూడా యావరేజ్ గా నడిచింది.

తరువార వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించింది.ఈ సినిమాతో ఆమె కెరీర్ పూర్తిగా గాడి తప్పింది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో జనాల ముందుకు వచ్చింది.కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద బోల్తా కొట్టింది.

ఇక శర్వానంద్ తో కలిసి రాధ అనే సినిమా, నాగ చైతన్యతో కలిసి యుద్ధం శరణం గచ్చామి, రామ్ తో కలిసి ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు.

అటు సాయి ధరత్ తేజ్ తో లావణ్య ఇంటెలిజెంట్ అనే సినిమా చేసింది.ఈ సినిమాను వి.వి వినాయక్ తెరకెక్కించాడు.కమర్షియల్ గా తిరుగులేని హిట్ అందుకుంటుందని అని అందరూ భావించారు.కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ లిస్టులోకి చేరింది.దీంతో త్రిపాఠి కెరీర్ కు మేఘాలు కమ్ముకున్నాయి.ఈ సినిమాలో అందాలను ఆరబోసినా.

పెద్దగా కలిసి రాలేదు.మొత్తంగా మెగా హీరోలతో చేసిన సినిమాలు కలిసి రాకపోవడంతో ఆమె కెరీర్ ఇబ్బందులో పడిందని చెప్పుకోవచ్చు.

Lavanya Tripati Career Problems Due To Mega Family

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube