టోల్ ఛార్జీలు ఆదా కావాలంటే.. గూగుల్ మ్యాప్స్ తో ఇలా చేసేయండి..!
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా చాలామంది గూగుల్ మ్యాప్స్( Google Maps ) వాడుతున్నారు.గూగుల్ ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్లను అందిస్తోంది.
గూగుల్ మ్యాప్స్ అందించే స్పెసిఫికేషన్లతో రోడ్డు టిప్ ను ప్లాన్ చేసుకుంటే.టోల్ చార్జీలు( Toll Charges ) ఆదా చేసుకోవచ్చు.
అందుకోసం ముందుగా గూగుల్ మ్యాప్స్ లో స్టార్టింగ్ పాయింట్, డెస్టినేషన్ ప్లేస్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత స్క్రీన్ పై భాగంలో కుడివైపు కార్నర్ లో కనిపించే త్రీ డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.
ఐఫోన్లలో ఈ త్రీ డాట్స్ ఐకాన్ హారిజంటల్ గా.ఆండ్రాయిడ్ ఫోన్లలో అయితే త్రీ డాట్స్ ఐకాన్ వెర్టికల్ గా ఉంటుంది.
ఇక త్రీ డాట్స్ మెనూ పై కనిపించే ఆప్షన్స్ అనే ఫీచర్ పై ట్యాప్ చేయాలి.
అప్పుడు అక్కడ అవాయిడ్ మోటర్ వేస్ లేదా అవాయిడ్ టోల్స్( Avoid Tolls ) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
ఆ ఆప్షన్ టోగుల్ ఆన్ చేయాలి.ఇక గూగుల్ మ్యాప్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి డెస్టినేషన్ ప్లేస్ వరకు మార్గాన్ని చూపుతుంది.
ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవాలి అనుకునే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
"""/" /
టూర్ల కోసం దూరప్రాంతాలకు వెళ్లేవారు టోల్ చార్జీలను ఆదా చేసుకోవడం కోసం ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.
దారి పొడవునా ఉండే దృశ్యాలు, లోకల్ కల్చర్స్ ఈ మ్యాప్ ద్వారా చూడవచ్చు.
హైవేలపై( Highways ) రద్దీ ఎక్కువగా ఉంటే నాయిసీ హైవేల నుండి కాకుండా ఇతర మార్గాలలో కూడా వెళ్ళవచ్చు.
"""/" /
అయితే టోల్స్ లేదా హైవేలను స్కిప్ చేయడం వల్ల ప్రయాణ సమయం పెరుగుతుంది.
కాబట్టి ఈ ఫీచర్ అవసరాలకు షెడ్యూల్ కు సరిపోతుందో లేదో నిర్ణయించుకోవాలి.ఈ ఫీచర్ ఉపయోగిస్తే కలిగే లాభనష్టాలను ముందుగానే అంచనా వేసి ఆ తర్వాత ఉపయోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది.
ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? చేసుకోకూడదా?.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!