2023 ఏడాదిలో భారత జట్టులో చోటు దక్కని క్రికెటర్లు వీళ్లే..!

2023లో ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ జరిగాయి కాబట్టి ఈ 2023 సంవత్సరం క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండి పోతుంది.ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత్, వన్డే ప్రపంచ కప్ టోర్నీ రన్నరప్ గా నిలిచింది.

 Cricketers Who Will Not Get A Place In The Indian Team In 2023 Dhawan Umran Mali-TeluguStop.com

వన్డే ప్రపంచ కప్ టోర్నీని తృటిలో చేజార్చుకున్న కూడా భారత జట్టు( Team India ) ఆటగాళ్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.అయితే ఈ 2023 ఏడాదిలో బీసీసీఐ సెలెక్టర్లు కొంతమంది ఆటగాళ్లను పక్కన పెట్టేసి జట్టులో స్థానం కల్పించలేదు.ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

శిఖర్ ధావన్:

2021, 2022 సంవత్సరాలలో వన్డే టోర్నమెంట్లు ఆడే భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్ కు( Shikhar Dhawan ) ప్రపంచ కప్ ఆడే జట్టులో మాత్రం చోటు దక్కలేదు.బీసీసీఐ శిఖర్ ధావన్ స్థానంలో శుబ్ మన్ గిల్ ను ఎంపిక చేసింది.

భువనేశ్వర్ కుమార్:

భారత జట్టు స్టార్ బౌలర్ గా కొద్దికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.బంతిని స్వింగ్ చేయడంలో దిట్ట.

అయితే 2022లో జరిగిన కొన్ని మ్యాచ్లలో డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్( Bhuvneshwar Kumar ) భారీ పరుగులు సమర్పించుకున్నాడు.అందుకు కారణంగా బీసీసీఐ 2023లో భువనేశ్వర్ కుమార్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది.

Telugu Bcci, Bcci Selectors, Cricketers, Indian, Shikhar Dhawan, Umran Malik, Ve

ఉమ్రాన్ మాలిక్:

మంచి స్టార్ పేసర్ గా గుర్తింపు తెచ్చుకుని 2022లో భారత జట్టు కు ఎంపికయ్యాడు.కానీ 2023లో ఉమ్రాన్ మాలిక్( Umran Malik ) భారత జట్టు తరుపున ఆడే అవకాశాలను బీసీసీఐ సెలెక్టర్లు కల్పించలేదు.

Telugu Bcci, Bcci Selectors, Cricketers, Indian, Shikhar Dhawan, Umran Malik, Ve

వెంకటేష్ అయ్యర్:

ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ అయ్యర్ ను( Venkatesh Iyer ) జట్టుకు మరో హార్దిక్ పాండ్యా దొరికాడని అనుకున్నారు.కానీ 2023లో బీసీసీఐ సెలక్టర్లు వెంకటేష్ అయ్యర్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు.

ఇక 2024లో ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్టర్లు అవకాశాలు ఇస్తారో లేదంటే పూర్తిగా పక్కన పెట్టేస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube