మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) గట్టిగా నమ్ముతారు.అలాగే చాలా మంది ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రోజు పూర్తి అయ్యేవరకు ప్రతి పనిని వాస్తు ప్రకారమే చేస్తూ ఉంటారు.
అలాగే చాలా మంది ప్రజలు ఇంటి నిర్మాణాన్ని కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది ప్రజలు ఇంటిలోను, వ్యాపారం చేసే ప్రదేశం లో ఏ దిక్కున ముఖం చేసి కూర్చోవడం వల్ల మంచి జరుగుతుందో అని సందేహ పడుతుంటారు.
ఈ సంవత్సరం గురించి వాస్తు నిపుణులు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంటి యజమాని, ఆఫీసులో యజమాని తప్పకుండా తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చోవాలి.అలాగే భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది.
‘
కాబట్టి సవ్యదిశకు మొహం పెట్టడం వల్ల లాభం ఉంటుంది.దీంతో మన శరీరంలోని ప్రధాన అవయవాలు సులభంగా చైతన్యవంతం అవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అందుకే యజమాని స్థానాన్ని చాలా ముఖ్యంగా చూస్తారు.
అలా అని మిగతా దిశలు పనికి రానివి అని అనుకోకూడదు.ఈ విధంగా వరుస క్రమంలో తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం దిశలలో కూర్చోవచ్చు.
ఒక్కో కార్యానికి ఒక్క ముఖంగా కూర్చోవడం మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే ఆఫీసు( Office )లో, ఇంట్లో మాత్రం యజమాని తప్పకుండా తూర్పు( East ) వైపుకు తిరిగి కూర్చోవాలి.
అలాగే హాస్టల్ గదులు, స్కూల్ లోని క్లాస్ రూములు, ఆఫీస్ రూములు కూడా ఈ దిశల ప్రకారమే నిర్మించుకోవాలి.
అలాగే హాస్టల్ గదులలో పిల్లలు తూర్పునకు గాని ఉత్తరానికి గాని ముఖం పెట్టేలా ఉండాలి.అలాగే ఉపాధ్యాయుడు పడమర లేదా దక్షిణం పెట్టేలా తరగతి గదిని సరైన తో ప్లాన్ చేసుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే పాఠశాలను, హాస్టల్లో వేరు చేసి నిర్మించడమే మంచిదనీ నిపుణులు చెబుతున్నారు.
టీచర్ కన్నా పిల్లలకే ప్రధాన ఇచ్చి సిట్టింగ్ పద్ధతిని ఏర్పాటు చేయడం మంచిది.పాఠశాల దక్షిణం వైపు అడ్మినిస్ట్రేషన్ అంటే వార్డెన్ ఆఫీస్, హాస్టల్ బిల్డింగ్ ప్లాన్ చేయడం మంచిది.
హాస్టల్ గదిలలో మంచాలు దక్షిణం, ఉత్తరంగా ఏర్పాటు చేయాలి.తల దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి.
DEVOTIONAL