గుమ్మం ముందు ఇవి ఉన్నాయా..? అయితే వెంటనే తీసేయండి..?

ఇల్లు అంటేనే వాస్తు ప్రకారం( Vastu ), అన్ని ఒక పద్ధతి ప్రకారం ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అలాంటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

 Are These In Front Of The Door? But Remove It Immediately , Vastu , Vastu Tips-TeluguStop.com

మరి ముఖ్యంగా కొన్ని వస్తువులను ఇంటి గుమ్మం వద్ద ఉంచితే జీవితంలో మనము కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.అయితే గుమ్మం ముందు ఉండకూడని వస్తువులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి గుమ్మానికి ఎదురుగా ముళ్ళ చెట్టుని అస్సలు ఉంచకూడదు. కాక్టస్, గులాబీ( Cactus ) మొక్క లాంటివి పెంచకూడదు.

అంతేకాకుండా ఎండిపోయిన, వాడిపోయిన మొక్కలు కూడా పెట్టకూడదు.

Telugu Cactus, Devotional, Dustbin, Garbage, Energy, Rose, Vastu, Vastu Tips-Lat

దీని వలన జీవితంలో చాలా దురదృష్టం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.చాలామంది గుమ్మం ముందు తలుపు దగ్గర అద్దాలు పెడుతూ ఉంటారు.దీని వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

అందుకే గాజు వస్తువులు గుమ్మం ముందు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి.ఇంటికి ఎదురుగా కత్తులు, గొడ్డళ్లు, గుణపాలు లాంటి ఆయుధాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకూడదు.

దీని వలన ప్రమాదాలు జరుగుతాయని చెబుతున్నారు.వీటిని ఎల్లప్పుడూ కూడా స్టోర్ రూమ్ లోనే ఉంచాలి.

విరిగిన వస్తువులను కూడా ఇంటి ముందు పెట్టడం అస్సలు మంచిది కాదు.

Telugu Cactus, Devotional, Dustbin, Garbage, Energy, Rose, Vastu, Vastu Tips-Lat

దీని వలన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.విరిగిన వస్తువులను ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో పెట్టకూడదు.గుమ్మం ముందు చెప్పులను ఇంటికి ఎదురుగా విడవకూడదు.

ఎప్పటికీ కూడా గుమ్మానికి పక్కగా చెప్పులు వదలాలి.ఇలా చేయడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.

చెప్పులను ఎలా పడితే అలా విడవకుండా ఓ స్టాండ్ లో పెట్టుకుంటే మరీ మంచిది.చెత్తను( Garbage ) ఇంటి గుమ్మంలో కానీ తలుపు దగ్గర కానీ అస్సలు పెట్టకూడదు.

ఇది అస్సలు మంచిది కాదు.ఇది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి తీసుకొస్తుంది.

చెత్తను ఇంటి ముందు కాకుండా ఇంటి వెనకాల పెట్టడం మంచిది.చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ కూడా వెలుగు ఉండాలి.చీకటి అస్సలు ఉండకూడదు.

దీని వలన నెగటివ్ ఎనర్జీ వస్తుందని హెచ్చరిస్తున్నారు.అందుకే గుమ్మం ముందు ఎక్కువగా వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

కాబట్టి వీలైనన్ని లైట్లు పెట్టడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube