ముఖ సౌందర్యాన్ని పాడు చేసే వాటిలో మొటిమలు, ముడతలు వంటివి ముందు వరుసలో ఉంటాయి.మొటిమలు ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.
అలాగే ముడతలు మనల్ని ముసలి వారిలా చూపిస్తాయి.అందుకే మొటిమలు, ముడతలు అంటేనే భయపడుతుంటారు.
అయితే ఈ రెండిటికీ చెక్ పెట్టే వండర్ ఫుల్ క్రీమ్ ఒకటి ఉంది.ఈ క్రీమ్ ను రోజుకు ఒక్కసారి వాడారంటే ఎలాంటి మొటిమలైనా ముడతలైనా మాయం అవ్వాల్సిందే.
మరి ఇంతకీ ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక నిమ్మ పండును తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక అరకప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు మరియు రెండు రెబ్బలు వేపాకు వేసి చిన్న మంటపై దాదాపు ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న ఆయిల్ ను వేసి రెండు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ సిద్ధం అవుతుంది.
ఒక బాక్స్ లో ఈ క్రీమ్ ను నింపుకుంటే రెండు మూడు వారాల పాటు వాడుకోవచ్చు.
రోజు నైట్ ఈ న్యాచురల్ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
రోజుకు ఒకసారి ఈ క్రీమ్ ను కనుక వాడితే ఎలాంటి మొండి మొటిమలు అయినా దెబ్బకు పరారవుతాయి.మొటిమలు తాలూకు మచ్చలు దూరం అవుతాయి.
అలాగే ముడతలు మాయమై స్కిన్ టైట్ గా మారుతుంది.పైగా ఈ క్రీమ్ వాడటం వల్ల చర్మం కోమలంగా కాంతివంతంగా మెరుస్తుంది.
మొటిమలు మచ్చలు ముడతలు లేని అందమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.