సాధారణంగా చాలా మంది ఫేస్ చేసే కామన్ సమస్యల్లో బ్యాడ్ బ్రీత్ ఒకటి.నోటి నుంచి దుర్వాసన రావడం వల్ల ఇతరులతో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడుతుంటారు.ఎదుటివారు కూడా మనతో మాట్లాడడానికి మక్కువ చూపరు.అలాంటి సమయంలో ఎంతో బాధగా ఉంటుంది.ఈ క్రమంలోనే నోటి నుంచి వచ్చే చెడు వాసన కి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు.మీరు ఏ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ మౌత్ వాష్ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.
రోజుకు రెండుసార్లు ఈ మౌత్ వాష్ ను వాడితే బ్యాడ్ బ్రీత్ అన్న సమస్యే ఉండదు.
మరి ఇంతకీ ఆ మౌత్ వాష్ ను ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాసు వెచ్చని వాటర్ ను పోసుకోవాలి.
అలాగే పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఐదు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఒక కంటైనర్ లో వేసి ఒక నిమిషం పాటు షేక్ చేస్తే మన హోమ్ మేడ్ మౌత్ వాష్ సిద్ధం అవుతుంది.ఈ మౌత్ వాష్ ను దాదాపు వారం రోజుల పాటు వాడుకోవచ్చు.రోజు ఉదయం మరియు నైట్ నిద్రించే ముందు ఈ మౌత్ వాష్ ను నోట్లో వేసుకుని కనీసం రెండు నిమిషాల పాటు బాగా పుక్కలించాలి.
ఆపై నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
నిత్యం ఈ న్యాచురల్ మౌత్ వాష్ ను వాడితే నోటి నుండి చెడు వాసన రాకుండా ఉంటుంది.
బ్యాడ్ బ్రీత్ సమస్యకు ఈ మౌత్ వాష్ తో సులభంగా చెక్ పెట్టవచ్చు.పైగా ఈ మౌత్ వాష్ ను వాడటం వల్ల నోటిలో బ్యాక్టీరియా నాశనం అవుతుంది.
చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు దూరం అవుతాయి.దంతాల ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.