చాలామంది అందరిలాగే వారి జీవితాన్ని రోజు పనిచేయడం, తినడం అంటూ ముందుకు వెళ్లడం అనే విధంగా కొనసాగిస్తుంటారు.అయితే మరికొందరు మాత్రం అందరికీ కాస్త భిన్నంగా ఆలోచించి వారు ఏ తరహాలో జీవించాలో అలా జీవిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాము.
అలాంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) చాలానే వైరల్ అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇకపోతే మన భారతదేశంలో టాలెంట్ ఉన్న వ్యక్తులకు లోటు లేదని చెప్పవచ్చు.
ఇదివరకు వారి ప్రతిభను ప్రపంచానికి ఎలా చెప్పాలో తెలియక పోయేది కాదు.ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ సంగతి జరిగిన క్షణాలలో ప్రపంచం మొత్తం ఆ విషయం ఇట్టే చేరిపోతుంది.
ఇకపోతే చాలామంది ప్రస్తుతం వారి ప్రతిభకు( Talent ) కాస్త పదును పెడుతూ ప్రపంచం మొత్తం వారిని మెచ్చుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ముంబై( Mumbai ) నగరానికి చెందిన ఓ ఆటో డ్రైవర్( Auto Driver ) చేసిన పనితీరు వల్ల తెగ వైరల్ గా మారింది.ఆ ఆటో డ్రైవర్ తన ఆటోను తన కోసమే కాకుండా.
తన ఆటోలో ఎక్కే కస్టమర్ల కోసం ఏకంగా కచేరి వేదికగా మార్చేశాడు.అంతే కాదండి మీకు గాని పాడాలని ఉత్సాహం ఉంటే పాడటానికి ఓ మైకును కూడా అందులో సెటప్ చేశాడంటే నిజంగా అతని కి మ్యూజిక్( Music ) మీద ఉన్న ఇష్టం కనబడుతుంది.
ఓ వ్యక్తి ముంబై నగర రోడ్డుపై కార్ లో ప్రయాణిస్తుండగా తన పక్కన ఉన్న ఆటోపై లుక్ వేయగా ఈ వీడియో ఆవిష్కృతమైంది.ఆ సదరు వ్యక్తి వీడియో తీస్తుండగా ఆటో డ్రైవర్ తన ఆటోలో ఉన్న మైక్ ను తీసి పాట పాడడం( Singing ) కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ వీడియోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ నెటిజన్స్ తెలియజేస్తున్నారు.కొందరైతే అంకుల్ తన టాలెంట్ ని నిజంగా ప్రపంచానికి తెలియజేశాడు అంటూ ఉండగా.
మరికొందరైతే బ్రదర్ మీరు ఏమి జరిగిన మీ అభిరుచి మాత్రం కోల్పోకూడదు అంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.