ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో రాజకీయాలు ఎప్పుడైనా చాలా ఆసక్తికరంగా ఉంటాయి.ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచే నియోజకవర్గం హుజురాబాద్.
( Huzurabad ) ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి హోరాహోరీ పోటీ పడుతున్నాయి.అలాంటివి నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.
ప్రజలంతా ఏ వైపు ఉన్నారు అనే విషయాలు చూద్దాం.హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి.
హుజురాబాద్ జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ ఉన్నాయి.ఇందులో మొత్తం 2 లక్షల 36వేల 872 ఓట్లు ఉన్నాయి.
అలాంటి హుజురాబాద్ లో ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, బిజెపి నుంచి ఈటల రాజేందర్(Etela Rajender), కాంగ్రెస్ నుంచి ఒడితల ప్రణవ్ బాబు బరిలో ఉన్నారు.
ఈ ముగ్గురు లీడర్లు కూడా రాజకీయంగా బ్యాగ్రౌండ్ ఉన్నవారే.
ఇందులో రాజేందర్ అక్కడ బలమైన లీడర్.ఇప్పటికే ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రికార్డు ఉంది.
ప్రస్తుతం నాలుగోసారి కూడా బరిలో ఉన్నారు.ఇక పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) విషయానికొస్తే ఆయన బీఆర్ ఎస్ పార్టీలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీలో బలమైన లీడర్ గా ఉన్నారు.
చాలాసార్లు ఈటల రాజేందర్ పై పోటీ చేసి కొద్ధిపాటిలో ఓడిపోయారు.అలాంటి పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బలమైన లీడర్ గా బరిలోకి దిగారు.
ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒడితల ప్రణవ్ బాబు బరిలో ఉన్నారు.
ఇక ఈయన రాజకీయ విషయానికి వస్తే ప్రణవ్ బాబు తాత ఓడితల రాజేశ్వరరావు ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ఆ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి.అలా ముగ్గురు బలమైన లీడర్లు హోరాహోరిగా తలపడుతున్నారు.ఇదే తరుణంలో ఈటెల రాజేందర్ గజ్వేల్ మరియు హుజురాబాద్ లో పోటీలో ఉన్నారు.
కానీ ఆయన ఈసారి ఎక్కువగా గజ్వేల్ (Gajwel) పైన దృష్టి పెట్టడంతో హుజురాబాద్ లో కాస్త గ్రాఫ్ తగ్గినట్టు తెలుస్తోంది.అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో బలమైన లీడర్ గా ఉండి ఆ బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు.
దీంతో కాంగ్రెస్ కేడర్ కాస్త గుర్రు మీద ఉంది.ఇక అప్పటినుంచి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బలమైన లీడర్ పోటీ చేయలేదు.ఈ సందర్భంలోనే ఈ 2023 ఎన్నికల్లో మాత్రం ప్రణవ్ బాబు (Pranav Babu) కాంగ్రెస్ లోకి వచ్చి పాత క్యాడర్ అంతా తనవైపు తిప్పుకున్నట్టు తెలుస్తోంది.ఈ విధంగా లీడర్ల మధ్య హో హోరహోరి పోటీ ఏర్పడింది.
ఇదే క్రమంలో గెలుపు ఎవరిని వరిస్తుందో చెప్పడం కాస్త ఇబ్బందికరంగానే ఉందని చెప్పవచ్చు.