వ్యవసాయంలో ( Agriculture )ఎంతో కష్టపడి పండించిన పంట కోతకు వచ్చాక, కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మార్కెట్లో పంటకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది.కేవలం పంట పండించడం పైన మాత్రమే కాకుండా పంట కోతల సమయాలలో కూడా సస్యరక్షక పద్ధతులను పాటించాలని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన వాణిజ్య పంటలలో ఒకటైన మిరప పంటను రైతులు ( Farmers )ఎంతో కష్టపడి పండించి చివరికి మిరపకోతల సమయాలలో యాజమాన్య పద్ధతులను సరిగా పాటించకపోవడం వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
మిరప పంట సాగు( Chilli Cultivation ) అధిక పెట్టుబడి వ్యయంతో కూడినదని అందరికీ తెలిసిందే.మిరప కోతల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.పంట దిగుబడితో పాటు పంట నాణ్యత పెంచడానికి చెట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడు కోసి ఆరబెట్టుకోవాలి.
చెట్టుపై మిరపకాయలు పూర్తిగా పండక ముందే కోతలు చేయాలి.చెట్టుపై కాయ పూర్తిగా పండితే నాణ్యత తగ్గుతుంది.
కోతల తరువాత మిరపకాయలను నేరుగా మట్టిపై కాకుండా పట్టాలు లేదా సిమెంట్ ఫ్లోర్ పై ఆరబెట్టాలి.
మిరపకాయల కోతలు కోసేముందు ఎలాంటి పిచికారి మందులు చేయకూడదు.మిరపలో 10 శాతానికి మించి ఎక్కువ తేమ లేకుండా ఉండే వరకు ఆరబెట్టాలి.తాలుకాయలు, మచ్చ కాయలు గ్రేడింగ్ చేసి వేరు చేయాలి.
మిరపకాయలు( Chillies ) ఆరిన తర్వాత తేమలేని శుభ్రమైన గోనె సంచుల్లో కాయలు నింపాలి.గోనెసంచులకు తేమ తగలకుండా వరి పొట్టు లేదా చెక్క బలల మీద గోడలకు దూరంగా నిల్వ ఉంచాలి.
శాస్త్రీయ పద్ధతులు ( Scientific methods )పాటించి మిరపకాయలను ఆరబెట్టి భద్రంగా నిలువ చేస్తే మార్కెట్లో మిరపకాయలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది.