రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ తరపున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు.
సంపన్న రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని యోగి అన్నారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న ఆయన ఆ రిజర్వేషన్లను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేస్తామని తెలిపారు.
అలాగే బుజ్జగింపు రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ కు కామన్ ఫ్రెండ్ మజ్లిస్ అని విమర్శించారు.