భారత జట్టు కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్ బై..కెప్టెన్సీ రేసులో ఉన్న ఐదు మంది ప్లేయర్లు వీళ్లే..!

ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అని అందరికీ తెలిసిందే.ఈ లెక్కన తదుపరి వరల్డ్ కప్ టోర్నీ 2027 లో జరగనుంది.

 Rohit Sharma Good Bye For The Captaincy Of The Indian Team These Are The Five Pl-TeluguStop.com

ప్రస్తుతం భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ( Rohit Sharma )2027 వరకు ఫిట్ గా ఉంటాడా.ఉండలేడా అనే విషయాన్ని పక్కన పెట్టి 2027 మెగా ఈవెంట్ కు భారత జట్టు మేనేజ్మెంట్ కొత్త కెప్టెన్ ని సిద్ధం చేయాలని భావిస్తోంది.

ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ తప్పుకుంటే కెప్టెన్ రేసులో ఉండే ఐదు మంది ప్లేయర్లు ఎవరో చూద్దాం.

హర్థిక్ పాండ్యా: భారత జట్టుకు ఆల్ రౌండర్.గతంలో టీ20 మ్యాచ్ లు ఆడే భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.రోహిత్ శర్మ టీం లో వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.భారత జట్టుకు కొత్త కెప్టెన్ కోసం బీసీసీ చూసే ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా ముందు వరసలో ఉన్నాడు.కాకపోతే హార్థిక్ పాండ్యా వరుసగా గాయాలకు గురి అవ్వడమే ఒక పెద్ద సమస్యగా మారింది.టీ20ల్లో హార్థిక్ పాండ్యా( Hardik Pandya ) రికార్డుల గురించి అందరికీ తెలిసిందే.మరి భారత జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ ను సెలెక్ట్ చేస్తారో లేదో చూడాలి.

Telugu Hardik Pandya, Kl Rahul, Rohit Sharma, Shreyas Iyer, Shubhman Gill, India

కేఎల్.రాహుల్:

భారత జట్టులో బ్యాటర్, వికెట్ కీపర్ గా కీలక ఆటగాడిగా ఉన్నాడు.జట్టు ఎంత ఇబ్బంది లో ఉన్న కాస్త కూడా ఒత్తిడికి గురి కాకుండా చాలా కూల్ గా ఉంటాడు.గతంలో కొన్నిసార్లు భారత జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది.రోహిత్ స్థానంలో ఇతన్ని భర్తీ చేస్తే ఎలా ఉంటుంది అని బీసీసీఐ భావిస్తోంది.
<

శ్రేయస్ అయ్యర్:

భారత జట్టులో టాప్ మిడిల్ ఆర్డర్లో కీలక ప్లేయర్.ఐపీఎల్ జట్లలో కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది.ఆటగాళ్ల వయసు పరంగా దూరదృష్టితో చూస్తే, దూకుడుగా ఆడగలిగే శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) కు కూడా కెప్టెన్ రేస్ లోకి వచ్చాడు.

శుభ్ మన్ గిల్:

భారత జట్టులో కీ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.భవిష్యత్తులో సచిన్, విరాట్ రికార్డులను కచ్చితంగా బ్రేక్ చేస్తాడని క్రికెట్ నిపుణుల అభిప్రాయం.

భారత్-ఏ జట్టును నడిపించిన అనుభవం ఉంది కాబట్టి కెప్టెన్ రేసులోకి వచ్చాడు.

Telugu Hardik Pandya, Kl Rahul, Rohit Sharma, Shreyas Iyer, Shubhman Gill, India

జస్ప్రిత్ బుమ్రా:

భారత జట్టులో స్టార్ పేసర్, గతంలో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఐదో మ్యాచ్ లో జట్టుకు సారథ్యం వహించాడు.ప్రస్తుతం ఇతను కూడా కెప్టెన్ రేసులోకి వచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube