తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నవంబర్ 28 చివరి తేది కావటంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.రోజుకి మూడు నాలుగు బహిరంగ సభలలో పాల్గొంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి( Congress Party ) 80 నుంచి 85 స్థానాలు వస్తాయని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి( BRS ) 25 స్థానాలకి మించిరావు, బీజేపీకి 4-6, ఎంఐఎం 6-7 స్థానాలు రావొచ్చని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి( CM KCR ) రేవంత్ సవాల్ విసిరారు.కేసీఆర్ ను ఉంచాలా.? దించాలా.? అనేది ప్రజలు నిర్ణయిస్తారు.అయితే చాలామంది ప్రజలు దించాలనే కోరికతో ఉన్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధం.ఈ క్రమంలో కేటీఆర్ లేదా హరీష్ రావు చర్చకు రావాలని కోరారు.
ఇదిలా ఉంటే తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.దీంతో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ వంటి నాయకులు ప్రచారాలలో బహిరంగ సభలలో చురుకుగా పాల్గొంటున్నారు.
తమ హయాంలో ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన గాని ఒకసారి కూడా గెలవకపోవడంతో ఈసారి ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నారు.