ప్రజలు తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తపరుస్తారు.కొందరు చిన్నచిన్న బహుమతులు ఇస్తారు, మరికొందరు సర్ ప్రైజ్‌లను ప్లాన్ చేస్తారు, మరికొందరు తమ ప్రియమైన వారి పేర్లను తమ శరీరాలపై టాటూలుగా వేయించుకుంటారు.
అయితే యూకేకు( UK ) చెందిన ఓ యువతి తన నుదుటిపై తన ప్రియుడి పేరును టాటూ వేయించుకుని ప్రియుడిపై తన పిచ్చి ప్రేమను చాటుకుంది.ఆమె టాటూ వేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం యువతలో టాటూలు బాగా ప్రాచుర్యం పొందాయి.చాలా మంది సెలబ్రిటీలు, సామాన్య వ్యక్తులు ప్రత్యేకంగా కనిపించడానికి వారి చర్మంపై వివిధ డిజైన్లు పొడిపించుకున్నారు.కొంతమంది తమ అభిమాన వ్యక్తుల పేర్లు లేదా చిత్రాలను ఆప్యాయత, జ్ఞాపకశక్తికి చిహ్నంగా టాటూలుగా వేయించుకుంటారు.కానీ యూకే నుంచి వచ్చిన యువతి చాలా ధైర్యంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది.
ఆమె తన ప్రియుడు కెవిన్( Kevin ) పేరును తన నుదుటిపై పెద్ద అక్షరాలతో టాటూగా వేయించుకుంది.టాటూ( Tattoo ) వేయించుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
కొందరు ఆమెను వెక్కిరిస్తూ.‘‘నీకు మాములుగా లేదు పిచ్చి.
ప్రియుడితో విడిపోతే ఏం చేస్తావు?’’ అన్నారు.
మరికొందరు ప్రేమను నిరూపించుకోవడానికి ఇంత స్టంట్ అవసరమా అని ప్రశ్నించారు.కొందరు ఈ వీడియో యొక్క ఫేక్ అని కూడా అనుమానించారు.ట్రోల్స్‌పై స్పందించిన యువతి తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
ఇది నిజమైన టాటూ.కెవిన్‌పై నాకున్న ప్రేమను తెలియజేసేందుకే ఇలా చేశాను.
చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం.మీరు అనుకున్నట్లు విడిపోము.
ప్రతిసారీ అద్దం ముందుకి వచ్చినప్పుడు నా ముఖంలో కెవిన్ పేరు చూసి చాలా సంతోషిస్తున్నాను.దానితో మీకేంటి ప్రాబ్లం? ” అని ట్రోలర్స్ కి గట్టిగా రిప్లై కూడా ఇచ్చింది.తాను ఎవరేమనుకున్నా పట్టించుకునేది లేదని స్పష్టం చేసింది.త్వరలో తన ప్రియుడిని మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నట్లు తెలిపింది.మొత్తం మీద ఈ వీడియో మాత్రం చాలా చాలామందిని షాక్‌కి గురిచేస్తుంది.