వీడియో: దీపావళి కానుకగా ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌.. వాటి ధరెంతో తెలిస్తే..

దీపావళి ( Diwali )పండుగ సమీపిస్తోంది.యజమానులు తమ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు బోనస్‌లు అందిస్తున్నారు.

 Video: Cars Are Gifted To Employees As A Diwali Gift. If You Know Their Price,-TeluguStop.com

కొందరు యజమానులు బ్రాండ్ న్యూ బైక్స్ అందిస్తుండగా మరికొందరు ఏకంగా కార్లనే పంచి పెడుతున్నారు.హర్యానాలోని పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తాజాగా ఇచ్చిన బహుమతులు చూసి ఎంప్లాయిస్ ఆశ్చర్యపోయారు.

ఆ కంపెనీ చైర్మన్ MK భాటియా దీపావళి సందర్భంగా తన నమ్మకమైన, కష్టపడి పనిచేసే 12 మంది ఉద్యోగులకు సరికొత్త టాటా పంచ్ ఎస్‌యూవీ( Tata Punch )లను బహుమతిగా ఇచ్చారు.ఆ ఖరీదైన కార్లను బహుమతులుగా పొందడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వారి సంతోషకరమైన క్షణాలను చూపించే వీడియోను భాటియా లింక్డ్‌ఇన్ పేజీలో పోస్ట్ చేశారు, అక్కడ అతను కార్ షోరూమ్‌లో ఆఫీస్ హెల్పర్‌తో సహా ఉద్యోగులకు కీలను అందజేస్తున్నట్లు చూడవచ్చు.ఇంతకు ముందెన్నడూ కారు నడపని ఓ ఉద్యోగి ఊహించని బహుమతికి కృతజ్ఞతలు, ఉత్సాహం వ్యక్తం చేశాడు.సంస్థ ఎదుగుదలకు, అనేక సవాళ్లను అధిగమించడానికి తన ఉద్యోగుల అంకితభావం, ప్రయత్నాలకు ప్రతిఫలమివ్వాలనుకుంటున్నట్లు భాటియా మీడియాకు తెలిపారు.

ఈ ఉద్యోగులు కంపెనీ ప్రారంభం నుంచి తన వెంటే ఉన్నారని, ఏనాడూ తన కంపెనీ నుంచి వెళ్లలేదన్నారు.అలాగే భవిష్యత్తులో లబ్ధిదారుల సంఖ్యను 12 నుంచి 50కి పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.ఇకపోతే టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ( TATA Micro SUV ) ధర సుమారు రూ.6 లక్షలు.ఇది 86bhp, 115 Nm టార్క్‌ను అందించే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.పట్టణ, గ్రామీణ రహదారులలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నడుస్తుంది.

ఈ స్టైలిష్, విశాలమైన కారు అందుకున్న ఉద్యోగులు తెగ ఖుషి అవుతున్నారు.ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube