ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ అధికార బారాస ప్రచార జోరును పీక్ స్టేజ్ కి తీసుకెళ్తుంది.ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్( Chief Minister KCR ) తన సుడిగాలి పర్యటనలతో భారీ బహిరంగ సభలలో ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా తమ ప్రభుత్వం చేసిన ఘనతలను ఏకరువు పెడుతున్న కెసిఆర్ బారాస పరిపాలనకు ముందు ఆ తర్వాత తెలంగాణలో ఉన్న పరిస్థితులను ప్రజలకు వివరిస్తున్నారు .ముఖ్యంగా వ్యవసాయ రంగానికి తాను చేసిన మంచిని అంకెలతో సహా వివరించి చెబుతున్న కేసిఆర్ ఒకప్పుడు 70 వేల టన్నుల పండిన ధాన్యం ఇప్పుడు మూడు లక్షల టన్నులకు చేరటం వెనుక తాను చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల కృషి ఉందని , నేడు వ్యవసాయ రంగం ఈ స్థాయిలో తెలంగాణ( Telangana ) లో అభివృద్ధి చెందటానికి ఉచిత కరెంటు దగ్గరనుంచి రైతు బీమా వరకూ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే దీనికి కారణమని ఈరోజు రైతు రాజుగా కాలర్ ఎగరవేస్తున్నాడంటే తమ ప్రభుత్వం ఇచ్చిన ఊతమే కారణమంటూ చెప్పుకొస్తున్నారు.
అంతేకాకుండా కాంగ్రెస్( Congress ) హయాంలో జరిగిన వైఫల్యాలను మరోసారి తెలంగాణ ప్రజలకు గుర్తుకు తెస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్( Dharani Portal ) తీసేస్తారని, ఉచిత కరెంటును మూడు నాలుగు గంటలకు పరిమితం చేస్తారని, ప్రస్తుతం అమలు చేయబడుతున్న సంక్షేమ పథకాలలో కూడా కోత విధిస్తారంటూ తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రం గా తాము చేసిన అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకున్న కేసీఆర్ జరిగిన మంచిని చూసే ఓటు వేయండి అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు.అయితే రెండు పర్యాయాలు తెలంగాణను పరిపాలించిన పార్టీ పట్ల సహజంగా ఉండే వ్యతిరేక వ్యతిరేకతకు తోడు ముఖ్యంగా బారాస సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అవినీతి ఆ పార్టీ విజయానికి ప్రధాన అడ్డంకి మారింది.చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై భూకబ్జా ఆరోపణల తో పాటు అనేక అవినీతి మరియు బెదిరింపు ఆరోపణలు వచ్చాయి.
అయితే రాజకీయ అవసరాల కోసం చాలామందిని తిరిగి కొనసాగించడంతో ఆ వ్యతిరేకత తమ పార్టీపై పడుతుందన్న భయం కూడా పార్టీని వేధిస్తుంది.అయితే దేశంలోనే ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణను ముందుకు నడిపిన పార్టీగా ప్రజలు తమ పట్ల కృతజ్ఞులై ఉంటారన్న ధీమా కూడా ఆ పార్టీలో కనిపిస్తుంది.
మరి తెలంగాణ ఓటర్లు రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్నవారిని చెబుతూ ఉంటారు.మరి బారాస అభివృద్ధి నినాదానికి ఏ స్థాయిలో తెలంగాణ ఓటర్ మద్దతు ఇస్తాడో చూడాలి.