ప్రముఖ బుల్లితెర ఛానెళ్లలో ఒకటైన ఈటీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో( Jabardasth ) ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.జబర్దస్త్ షోలో కనిపించే పృథ్వీ,( Prudhvi ) రిషి( Rishi ) తల్లి శ్రీలత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుకుల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
దేవుడు నా ఇద్దరు కొడుకులను మరగుజ్జులుగా పుట్టించాడని ఆమె అన్నారు.మూడోసారి గర్భం వచ్చిన సమయంలో ఈ పిల్లలలా పుడతారేమోనని అబార్షన్ చేయించుకున్నానని ఆమె తెలిపారు.
మా ఆయన ఆటో డ్రైవర్ అని రోజుకు 400 రూపాయలు వస్తాయని మా అమ్మకు యాక్సిడెంట్ లో చేయి పోయిందని అమ్మను కూడా నేనే చూసుకోవాలని శ్రీలత( Srilatha ) పేర్కొన్నారు.జబర్దస్త్ షోలో ఇచ్చే డబ్బులు ఛార్జీలకే సరిపోతున్నాయని హైదరాబాద్ కు వచ్చీ పోవడానికే 7,000 రూపాయలు అవుతోందని ఆమె కామెంట్లు చేశారు.
రిషికి( Rishi ) గుండెలో హోల్ ఉందని ఆపరేషన్ చేయించామని శ్రీలత వెల్లడించారు.
మూడు నెలలకు ఒకసారి చెకప్ చేయించాలని అప్పుడు 10,000 రూపాయలు అవసరం అవుతాయని శ్రీలత చెప్పుకొచ్చారు.రిషికి అరోగ్యకరమైన ఆహారం పెట్టాలని మా స్థోమతను మించి ఆహారం సమకూర్చలేమని శ్రీలత వెల్లడించారు.నేను కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా ( Junior Artist ) ఐదు సంవత్సరాల పాటు కష్టపడ్డానని శ్రీలత తెలిపారు.
ఇప్పుడు నా పిల్లలు కష్టపడుతున్నారని ఆమె తెలిపారు.
నా పిల్లలను అందరూ హేళన చేస్తున్నారని శ్రీలత అన్నారు.పిల్లల ఆరోగ్యం బాలేకపోవడంతో 5 లక్షల రూపాయలు అప్పు చేశానని ఆమె తెలిపారు.అప్పుల వాళ్లు తిడుతున్నారని వడ్డీ కడుతున్నాం కానీ అప్పు తీర్చేంత డబ్బు మాత్రం మాతో లేదని శ్రీలత పేర్కొన్నారు.
శ్రీలత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శ్రీలత కుటుంబానికి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఎవరైనా సహాయం చేస్తారేమో చూడాల్సి ఉంది.