నిన్నటి తరం స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ( Balakrishna )మరియు విక్టరీ వెంకటేష్ టాప్ 4 హీరోస్ లో ఇద్దరు అనే సంగతి మన అందరికీ తెలిసిందే.విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటే, బాలయ్య బాబు కి మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉంది.
ఇద్దరికీ ఇద్దరు నువ్వా నేనా అనే రేంజ్ పోటీ లేదు కానీ, ఎవరి ఇమేజి వాళ్లకు ఉంది.అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
కానీ బయట వీళ్ళ మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.వెంకటేష్ తండ్రి దగ్గుపాటి రామానాయుడు( Daggubati ramanaidu ) బాలయ్య తండ్రి ఎన్టీఆర్ తో ఎన్నో సంచలనాత్మక రికార్డ్స్ ని నెలకొల్పిన సినిమాలను నిర్మించాడు.
ఆ కుటుంబం తో రామానాయుడు తో పాటుగా వెంకటేష్ కి కూడా అలా మంచి సాన్నిహిత్యం ఉంది.
అయితే వీళ్లిద్దరి మధ్య అప్పట్లో ప్రముఖ హీరోయిన్ దివ్య భారతి ( Divya Bharathi )చిచ్చు పెట్టింది అంటూ అప్పటి మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది.అసలు విషయానికి వస్తే దివ్య భారతి అప్పట్లో విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘బొబ్బిలి రాజా’( Bobbili Raja ) అనే చిత్రం చేసింది.ఈ సినిమా ఆరోజుల్లో సంచలనం సృష్టించింది.
ఈ చిత్రం చేస్తున్న సమయం లోనే వీక్లీ మ్యాగజైన్ లో దివ్య భారతి ఫోటోలను చూసి బాలయ్య బాబు ఎంతో నచ్చాడట.అప్పుడే ఆయన బి.గోపాల్ దర్శకత్వం లో ‘లారీ డ్రైవర్’ అనే చిత్రం ఒప్పుకున్నాడు.ఈ చిత్రం లో హీరోయిన్ గా దివ్య భారతి ని సెలెక్ట్ చెయ్యమని అడిగాడట బాలయ్య బాబు.
అప్పటికే ఇంకా బొబ్బిలి రాజా షూటింగ్ పూర్తి అవ్వలేదు.ఇంకా జరుగుతూనే ఉంది, డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో బాలయ్య బాబు స్వయంగా వెంకటేష్ కి ఫోన్ చేసి దివ్య భారతి డేట్స్ కోసం మాట్లాడాడట.
అప్పుడు వెంకటేష్ కచ్చితంగా మా నిర్మాత తో ఒకసారి చర్చలు జరిపి మీకు తెలియచేస్తాను అని అన్నాడట.గమ్మత్తు ఏమిటంటే ఈ సినిమాకి కూడా డైరెక్టర్ బి.గోపాల్ యే అన్నమాట.వెంకటేష్ తో కలిసి దివ్య భారతి డేట్స్ సర్దుబాటు చెయ్యడానికి నిర్మాతతో చర్చలు జరిపారట.నెల రోజుల పాటు అడవిలో నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ ప్లాన్ చేసాం, ఇప్పుడు కొన్ని రోజులు షూటింగ్ ఆపితే చాలా నష్టపోతాను, అవతల మిగిలిన ఆర్టిస్టుల డేట్స్ కూడా కమిట్ అయ్యాయి, అవన్నీ వృధా అవుతాయి, నేను దివ్య భారతి ( Divya Bharathi )ని వదలడానికి సిద్ధంగా లేను అని చెప్పాడట.
ఇదే విషయాన్నీ బాలయ్య బాబు కి వెంకటేష్ ఫోన్ చేసి తెలిపాడట.కానీ బాలయ్య బాబు ఈ విషయం లో హర్ట్ అయ్యాడట, అప్పటి నుండి వెంకటేష్ తో పెద్దగా మాటలు లేవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.