అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023( Amazon Great Indian Festival ) లైవ్ లో ఉంచిన సంగతి తెలిసిందే.ఈ సేల్ లో అనేక ప్రొడక్ట్స్ పై కంపెనీ భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.
ఇదే సందర్భంగా శామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 ప్రో ప్రీమియం ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపును అందించింది.ఈ ఇయర్‌బడ్స్‌ను రూ.10,999కి సొంతం చేసుకోవచ్చని లిస్ట్ చేసింది.ఒకవేళ కస్టమర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, ఏకంగా రూ.8,099 డిస్కౌంట్ పొంది ఫైనల్ ప్రైస్ రూ.2,899కే కొనుగోలు చేయవచ్చని కూడా పేర్కొంది.
గెలాక్సీ బడ్స్ 2 ప్రో( Galaxy Buds 2 Pro ) సాధారణంగా దాదాపు రూ.15,000 ధర పలుకుతుంటాయి.ఆ ధరతో పోలిస్తే రూ.2,899 చాలా తక్కువ కాబట్టి చాలా మంది కస్టమర్లు ఈ తగ్గింపు ధరకు ఇయర్‌బడ్‌ల కోసం ఆర్డర్లు చేశారు.అయితే, ధరకు సంబంధించిన సాంకేతిక సమస్య కారణంగా అమెజాన్ ఈ ఆర్డర్లన్నింటినీ క్యాన్సిల్ చేసింది.టెక్ సమస్య వల్ల ప్రైస్ తప్పుగా లిస్ట్ చేశామని, అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని కంపెనీ తెలిపింది.
బాధిత కస్టమర్లందరికీ పూర్తి రిఫండ్ అందించింది.
కొంత మంది కస్టమర్లు ఈ ఇయర్‌బడ్స్‌ను భారీ తగ్గింపు ధరతో అందుకోవాలని చాలా ఆశపడ్డారు.కానీ అమెజాన్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడంతో నిరాశ చెందారు.అమెజాన్ మోసం( Amazon Cheating ) చేసిందని, కంపెనీ ఆర్డర్లను రద్దు చేయడం అన్యాయమని కొందరు అన్నారు.
మరికొందరు టెక్నికల్ ఇష్యూ( Technical issue ) వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అర్థం చేసుకున్నారు.గతంలో కూడా ఇలాంటి తప్పుడు ప్రైసింగ్స్తో అమెజాన్ కస్టమర్స్‌ను ఆశపెట్టి తరువాత ఆర్డర్స్ క్యాన్సిల్ చేసింది.