ఒక సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటి నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం కోసం చాలా సినిమాల్లో నటిస్తూ నటులుగా మంచి పేరును సంపాదించుకుంటూ ఉంటారు.ఒకప్పుడు హీరోయిన్లు గా కొనసాగిన చాలామంది హీరోయిన్లు ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు.
మరి కొంతమంది మాత్రం సూపర్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తర్వాత కొన్ని సినిమాలు చేసి ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్లలో కీర్తి రెడ్డి( Keerthy Reddy ) ఒకరు.ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమా( Tholiprema Movie )లో హీరోయిన్ గా నటించింది.ఈమె నటనకి మంచి గుర్తింపు వచ్చింది అలాగే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కూడా గుర్తింపు పొందింది.అయితే ఆమె ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్ లు రాలేదు.
దాంతో హీరో సుమంత్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.కానీ వీళ్ల ఇద్దరి మధ్య కొన్ని గొడవలు రావడంతో అధికారికంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
దాంతో ఆమె బెంగళూరుకు చెందిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయినప్పటికీ ఈమె ఇక సినిమాల్లో మాత్రం నటించడం లేదు.అలా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా( Pawan Kalyan )లో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఆవిడ ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోవడం మళ్లీ సినిమాల్లో నటించకుండా ఉండటం అనేది ఆమె అభిమానులకి కొంతవరకు బాధను కలిగించే విషయమనే చెప్పాలి.అయితే ప్రస్తుతం తెలుస్తున్న విషయం ఏంటంటే ఆవిడ తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని చూస్తుంది.అందులో భాగంగానే కొంతమంది డైరెక్టర్లు చెప్పిన స్టోరీలు కూడా వింటుంది మళ్లీ తెలుగు సినిమాల్లో ఆసక్తిని చూపిస్తుంది.
చూడాలి మరి ఆమె మళ్ళీ తెలుగు సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది…
.